ప్రతి సంవత్సరం కొబ్బరి బోండాల రేటు పెరుగుతూ వస్తోంది. గోదావరి జిల్లాల్లో వీటి రేటు తక్కువగానే ఉన్నా రాయలసీమ జిల్లాల్లో ఒక్కొక్కటి 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతూ ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కొబ్బరినీళ్లు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. 
 


కొబ్బరి నీళ్లు ప్రతి జబ్బుకు సర్వరోగ నివారిణిగా ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఎంతో సహాయపడతాయి. మనల్ని విష వ్యర్థాల నుంచి, సూక్ష్మ క్రిముల నుంచి కాపాడటంలో సహాయపడతాయి. ఈ నీళ్లలో సి విటమిన్, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. కొబ్బరి నీళ్లు నీరసంగా ఉన్నవారికి తక్షణమే శక్తినిస్తాయి. 
 


కొబ్బరి నీళ్లు తాగితే తల తిరగడం, కడుపులో గడబిడ లాంటి సమస్యలు దూరమవుతాయి. ఈ నీళ్లు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరిగి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రోజూ పరగడుపున కొబ్బరినీళ్లు తాగితే థైరాయిడ్ సమస్య దూరమవుతుందని పరిశోధనల్లో తేలింది. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే చర్మం మృదువుగా మారడంతో పాటు డీ హైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. కొబ్బరినీళ్లు కంటి చూపును మెరుగుపరచటంలో సహాయపడతాయి. ఈ నీళ్లలో ఉండే విటమిన్లు మతిమరపు సమస్యను తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: