కరోనా.. ఇప్పుడు అందరినోటా వినిపిస్తున్న మూడు అక్షరాల పదం ఇదే. మరి ఇది మనకు సోకే అవకాశం ఎంత వరకూ ఉంది. మీకు ఆ వైర‌స్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని భయపడుతున్నారా.. మీకు గానీ, మీ కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, బంధువుల్లో ఎవ‌రికైనా స‌రే.. ఆ వైర‌స్ సోకుతుందేమో అనుకుంటున్నారా.. అసలు మీరు ఎంత రిస్క్ లో ఉన్నారు.

 

 

ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. అమెరికాకు చెందిన ఇనోవాక్సీర్ అనే సంస్థ ఇందుకోసం ఓ వెబ్ సైట్ ను రూపొందించింది. మీరు ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఓ సర్వే ఉంటుంది. ఆ సర్వేలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి మీరు సమాధానం ఇస్తే.. ఫైనల్ రిజల్ట్ మీకు వస్తుంది.

 

 

మీరు ఇచ్చిన సమాధానాలను బట్టి మీ రిస్క్ జోన్ ఏంటో ఆ వెబ్ సైట్ చెప్పేస్తుంది. https://innovaccer.com/test-yourself-goa/ ఈ వెబ్‌సైట్‌లో ఆ టెస్ట్ అందుబాటులో ఉంది. మరింకేం.. ఓసారి మీరూ ప్రయత్నించండి.. మీకు తెలిసినవారికీ దీన్ని పరిచయం చేయండి. ఇది వెబ్ సైట్లోనే కాదు.. యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: