క‌రోనావైర‌స్‌కు పుట్టినిల్ల‌యిన చైనాలో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నాయి..వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాజిటివ్ కేసులు అత్య‌ల్ప స్థాయిలోకి చేరాయి. ఇక వేలాది కేసులు న‌మోదైన హువాయి ప్రావిన్స్ లాంటి న‌గ‌రంలో ప్ర‌స్తుతం గ‌త వారం రోజుల్లో ఒక్కటంటే ఒక్క‌టి కొత్త కేసు న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దేశం మొత్తంలో ఒక‌ట్రెండు కేసులు న‌మోదైన చాలా వ‌ర‌కు ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన‌ట్లుగానే ఆ దేశ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే చైనాలోని చాలా ప్రాంతాల‌కు ఆంక్ష‌ల నుంచి స‌డ‌లింపు ఇచ్చారు. జ‌నం రోడ్ల‌పైకి వ‌స్తూ త‌మకు అవ‌స‌ర‌మున్న వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.

 

చిన్న‌చిన్న ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. అయితే కార్పొరేట్ సంస్థ‌ల‌కు మాత్రం ఇంకా అధికారికంగా స‌డ‌లింపు ఇవ్వ‌డం లేదంట‌. రెండు మూడు రోజుల్లో పూర్తిగా ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తార‌ని చైనా ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోందని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. చైనా కుదుటుప‌డిన నేప‌థ్యంలోనే దాదాపు 600మంది వైద్యుల బృందం ఇట‌లీకి బ‌య‌ల్దేరి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. వైద్య సాయం అందించేందుకు చైనా ప్ర‌భుత్వం ముందుకు రావడంపై  ఇటలీ ప్ర‌భుత్వం ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఇట‌లీ స‌హ‌, స్పెయిన్‌, అమెరికా, భార‌త్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో క‌రోనా ఉధృత‌మ‌వుతోంది. ఇది ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

అమెరికాలో అదుపులోకి వ‌స్తున్న ఇండియాలో మాత్రం రోజురోజుకు చేజారిపోతోంది. భార‌త్‌కు ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగుతున్నాయ‌నే చెప్పాలి. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వెల్ల‌డించిన కరోనా ఫ‌లితాల ప్ర‌కారం. ఇప్ప‌టి వ‌ర‌కు 538కేసులు న‌మోద‌య్యాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి  పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో ఇండియా మ‌రో ఇట‌లీ కాబోతోంద‌న్న అన్న అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రపంచంలో అత్యధిక భూభాగం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఇప్పుడు హుబెయి ప్రావిన్స్ ను భారత్ తలపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: