క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌ధాన‌మంత్రి మోదీ సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకున్నారు. మూడు వారాల పాటు అంటే 21 రోజుల పాటు దేశం మొత్తం ష‌ట్‌డౌన్‌ను విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించ‌డం క‌న్నా ఉత్త‌మ‌మైన ప‌రిష్కారం మార్గం క‌నిపించ‌డం లేద‌ని తెలిపారు. ఈ 21 రోజులు మ‌న దేశ భ‌విష్య‌త్‌కు ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు వైద్య నిపుణులు 21 రోజులు కావాల‌ని కోరార‌ని, అందుకే ష‌ట్ డౌన్ విధించ‌క త‌ప్ప‌డం లేద‌ని పేర్కొన్నారు. నా పిలుపునందుకు జ‌న‌తా క‌ర్ఫ్యూను ఎంతో బాగా విజ‌యవంతం చేశారు.

 

 ప్ర‌తీ ఒక్క‌రూ భాగ‌స్వాముల‌య్యారు. ఐక్య‌త‌కు ప్ర‌తిబింబంలా నిలిచారని కొనియాడారు. గ‌డిచిన 11 రోజుల్లోనే ల‌క్ష‌మంది వ‌ర‌కు అనుమానితులు వివిధ ఆస్ప‌త్రుల్లో ఉన్న‌ట్లు చెప్పారు. ఈ ల‌క్ష‌మంది మ‌రో ల‌క్ష‌మంది కావ‌డానికి కేవ‌లం నాలుగంటే నాలుగు రోజుల‌కు మించి స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అన్నారు. కరుణ ఎంత వేగంగా వ్యాపిస్తోందో తెలియ‌జేయ‌డానికి ఈ గ‌ణాంకాలే ఉదాహ‌ర‌ణ అని హెచ్చ‌రించారు. అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ చెబుతున్నా ప్ర‌జ‌లారా కొద్దికాలం పాటు పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వండి. బ‌య‌ట‌కి వెళ్లాల‌నే ఆలోచ‌నే మీ మ‌దిలోకి రానివ్వ‌కండి. ఈ 21రోజులు ఇంటి గ‌డ‌ప‌ను ల‌క్ష్మ‌ణ రేఖ‌లా భావించండి..పాటించండి. 


ఇక ఎక్కువ మందిని క‌లిసే ప్ర‌య‌త్నం అస్స‌లు చేయొద్దు. ఎందుకంటే క‌రోనా బాధితులు కూడా సాధార‌ణ ఆరోగ్య‌వంతుల్లాగే ఉంటారు. రోగి ల‌క్ష‌నాలు బ‌య‌ట‌ప‌డ‌టానికి కొద్దిపాటి స‌మ‌యం ప‌డుతుంది. అందుకే ఒంట‌రిగా..వ్య‌క్తుల‌కు దూరంగా.ఉంటూ ప‌రిశుభ్ర‌త‌ను పాటించండని పిలుపునిచ్చారు.  అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పంజా విసురుతూనే ఉంది. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నాం. దీనిని ప్ర‌తీ ఒక్క‌రూ విజ‌య‌వంతం చేయాలి. భారత్‌ను కాపాడుకోవడం కోసం, దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రి నుంచి ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు’’ అని ప్రధాని మోదీ కోరారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఇది తప్పనిసరి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: