కరోనా భూమి మీద అడుగు పెట్టిన నాటినుంచీ స్వేచ్చగా ఏమీ చేయలేని పరిస్థితి. సరదాగా ఏటన్నా వెళ్ళాలన్నా , నలుగురు కలిసి మాట్లాడుకోవలన్నా, చుట్టం చూపుకి వచ్చే వాళ్ళు ఇంటికి రావాలన్నా ఇలా ప్రతీ విషయంలో  కరోనా వైరస్ అడ్డుపడుతోంది. చివరికి స్వేచ్చగా తుమ్ము కావాలన్నా సరే కరోనా భయంతో తుమ్ముని ఆపేసుకుంటున్నారు చాలా మంది. తుమ్మితే ఎక్కడ కరోనా బాధితులు అనుకుంటారో, తిట్టుకుంటారో ఒకడుగు ముందుకు వేసి కొట్టడానికి వస్తారోనని కంగారుపడి చస్తున్నారు ప్రజలు..ఈ క్రమంలోనే

IHG

తుమ్ము వచ్చే తప్పుడు బలవంతంగా అపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తుమ్ము వస్తే బలవంతంగా ముక్కు మూసుకుని వచ్చే తుమ్ముని ఆపేస్తున్నారట. అంతేకాదు తుమ్ము ఆగిపోయిన తరువాత హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ కరోనా కంగారుతో అందరూ ప్రస్తుతం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కరోనా మాటేమో కాని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు...అంతేకాదు

IHG

తుమ్ము వస్తే తుమ్మేయండి కానీ మో చేతిని అడ్డం పెట్టుకుని తుమ్మడం మంచిది. చుట్టుపక్కల ప్రజలని గమనించి తుమ్మండి అంతేకాని తుమ్ముని బలవంతంగా ఆపుకోవద్దు ఎందుకంటే చెవిలో ఉండే డయాఫ్రమ్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుందట దాంతో చెముడు వస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కంట్లో తెల్లని పొరపై ఐరిస్ చుట్టూ ఉండే రక్త నాళాలు ఒక్కసారిగా దెబ్బతింటాయట. ఇదిలాఉంటే సైన్స్ సమస్య ఉన్నవారు తుమ్ములని బలవంతంగా ఆపేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని అంటున్నారు. మరి ఇకపై తుమ్ము వస్తే అపుకునే ప్రయత్నాలు మాత్రం చేయకండి....

మరింత సమాచారం తెలుసుకోండి: