శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను పాల‌ ద్వారా పొందవచ్చు. కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివి పాల ద్వారా శరీరానికి ఎంతో చ‌క్క‌గా అందుతాయి. మ‌రియు వెల్లుల్లిలో చిన్న చిన్న పాయల్లో విషపదార్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్, సూక్షక్రిములను చంపేసే యాంటీమైక్రోబయల్, విషవ్యర్థాలను బయటకుపంపే యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. అయితే పాలు, వెల్లుల్లి క‌లిపి తీసుకుంటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. పాల‌లో వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉడ‌క బెట్టి తాగ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

 

వెల్లులిని, పాలతో కలిపి వేడి చేసి తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధ వ్యాధులు నయం అవుతాయి. లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.  జ్వ‌రం కార‌ణంగా ప్లేట్‌లెట్లు త‌గ్గిపోతున్న వారికి ఇది మంచి ఔష‌ధం.  అలాగే గార్లిక్ మిల్క్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్తి , ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.

 

అదేవిధంగా, వెల్లిల్లి పాల వ‌ల్ల వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. గాయాలు, పుండ్లు ఉన్న వారు  వెల్లిల్లి పాలు తాగితే అవి త్వ‌ర‌గా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో రెట్టింపు యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. మ‌రియు ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ సమ‌స్య‌ల‌ను న‌యం చేసే శ‌క్తి కూడా వెల్లుల్లి పాల‌కు ఉంటుంది. కాబ‌ట్టి వెల్లుల్లి పాల‌ను అప్పుడుప్పుడు తాగుతూ ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: