బెల్లం అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.. ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని ఇష్ట‌ప‌డ‌తారు. బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది. కాబ‌ట్టి దీని వల్ల శరీరానికి ఎలాంటి హని క‌ల‌గ‌దు. బెల్లంలో ప్రోటీన్లు, ఫైబర్స్, మినరల్స్, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం చెరుకు నుంచి దీన్ని తయారు చేస్తారు కాబట్టి రుచి కూడా బాగా ఉంటుంది. అయితే మీరు ఎంపిక చేసే బెల్లం ముదురు రంగు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లంలోనే కల్తీ ఉండదు. ఇక బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయి.

 

అలాగే జ‌లుబుతో బాధ ప‌డుతున్న వారికి బెల్లం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. కాబ‌ట్టి జలుబుతో బాధపడుతోన్న వారు పెరుగు, బెల్లం కలిపి రోజూ రెండు పూటలు తీసుకుంటే స‌మ‌స్య‌ తగ్గుముఖం పడుతుంది. అలాగే బెల్లం, నెయ్యి సమపాళ్ల కలిపి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు వ‌ల్ల వ‌చ్చే త‌ల‌నొప్పి, మైగ్రిన్ తల నొప్పి తగ్గుతాయి.

 

అదేవిధంగా అధిక దగ్గు, జలుబు తో బాధ పడేవారు వేడి నీళ్ళలో బెల్లం కలుపుకుని తాగితే తగ్గుతుంది. మ‌రియు టీ లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుని తాగినా మంచిఫలితం పొందొచ్చ‌ని అంటున్నారు నిపుణులు. అలాగే బెల్లం లో జింక్, సిలినియయ్ మూలకాలు ఉండటం వల్ల ఇన్ ఫెక్షన్ ల వల్ల డ్యామెజ్ అయిన కణాలను తిరిగి బాగు చేస్తుంది. రక్తంలో హిమగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: