క‌రోనా క‌ట్ట‌డిలో భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన క‌ఠిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలిస్తున్నాయా..? అంటే వైద్య నిపుణులు అవున‌నే అంటున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్ల కే ప‌రిమిత‌మ‌వ‌డం, నోటికి మాస్కులు ధ‌రించ‌డం చ‌ర్య‌ల‌తో క‌రోనా పెరుగుద‌ల శాతం త‌గ్గిన‌ట్లుగా వైద్య నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య తగ్గకపోయినా, పెరుగుదల నిష్పత్తిలో మాత్రం తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  అయితే ఇలాంటి  స‌మ‌యంలో  ప్ర‌జ‌లు ఎంత‌మాత్రం ఉదాసీనత ప్రదర్శించకుండా ఆంక్షలన్నింటినీ యథాతథంగా అనుసరించాలని సూచించారు.


దేశంలో క‌రోనా వ్యాప్తి, ప‌రిస్థితుల‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో న‌మోదైన కేసులు, అందుతున్న వైద్యం, ప్ర‌జ‌లు పాటిస్తున్న జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.   ప్రజలు  ఎలాంటి అలసత్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడాద‌ని, సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌‌ను రాష్ట్రాలు మర్ధవంతంగా అమలుచేయాలని సూచించారు.హాస్పిటల్స్‌లో సదుపాయాలు, క్యారంటైన్ శిబిరాల అందుబాటు తదితర అంశాలపై రాష్ట్రాల మంత్రుల నుంచి ఆరా తీశారు. ఇదిలా ఉండ‌గా శుక్రవారం ఉదయానికి దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 దాటింది.


వైర‌స్‌కు పుట్టినిల్ల‌యిన చైనాలో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి చేరుకుంటున్నాయి. గురువారం చాలా ప్రాంతాల్లో ఆంక్ష‌ల‌ను ఎత్తివేశారు. ప్ర‌జార‌వాణా మెరుగుప‌డింది. అదే స‌మ‌యంలో ఇట‌లీ, అమెరికా, స్పెయిన్ దేశాలు క‌రోనాతో క‌కావిక‌లం అవుతున్నాయి. అయితే భార‌త్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఊహించినంత‌గా ప‌రిస్థితి దిగ‌జార‌లేద‌ని, ఇది ప్ర‌జ‌లంద‌రి అదృష్టంగా భావించాల‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైమ‌రీ కాంటాక్టు కేసులు పెరుగుతుండ‌టం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, సామాజిక దూరం, లాక్‌డౌన్ అమ‌లుతో వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: