సాధార‌ణంగా మనం పాటించే జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇక ప్ర‌స్తుత‌ కాలంలో చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా చాలా మంది షుగర్, బీపీ ఇత‌రిత‌ర‌ వ్యాధుల‌తో బాధపడుతున్నారు. ఆరోగ్యం అనుకుంటున్న కూరగాయలు పండ్లు తమ మెనూలో ఉన్నా ప్రాణాంతక వ్యాధుల బారిన పడాల్సివస్తోంది. వీటన్నింటికి కారణం సరైన ఆహారం, అందులోనూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడమే. అలాగే మ‌నం నిత్యం వాడే కొన్ని కొన్ని ప‌దార్థాలు కూడా మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతాయి.

 

అందులోనూ మ‌నం నిత్యం వాడే కొన్ని తెల్ల‌ని విష‌ప‌దార్థాలు, వాటి వ‌ల్ల వ‌చ్చే డేంజ‌ర్ ప‌రిస్థితులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా పాలు. అదేంటి పాలు విష‌ప‌దార్థం ఎలా అవుతుంది అనుకుంటున్నారా..? సాధార‌ణంగా పాలను పాయిశ్చరైజర్ చేస్తారు. పాలు తెల్లగా కనిపించేందుకు.. కొన్నిసార్లు ఈ పాయిశ్చరైజేషన్ మరీ ఎక్కువ చేస్తారు. అప్పుడు అందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు నాశనమవుతాయి. అలాగే మిగిలిన ప‌దిశాతం పోషకాలు మనకు ఎందుకూ పనికిరావు. 

 

ఇక పాలల్లో కలిపే ప్రమాదకర రసాయనాల వల్ల మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే బియ్యం.. ఒక్కోసారి తెల్లగా ఉండాలని బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేస్తుంటారు. దీంతో బియ్యంలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు నాశిస్తాయి. ఇలా వండిన అన్నాన్ని తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మ‌రియు ఉప్పు.. రిఫైన్ చేసిన ఉప్పు తింటే గుండె సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. ఇక బీపీ కూడా ఎక్కువవుతుంది. రిఫైన్ చేయబడిన గోధుమపిండి లేదా మైదాపిండి తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. సో.. బీకేర్‌ఫుల్‌..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: