క‌రోనాతో క‌కావికల‌మైన ఇట‌లీలో ఒక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన  సంఘ‌ట‌న జ‌రిగింది. ప్రాణాంతక కోవిడ్‌-19 బారిన పడిన 101 ఏళ్ల వయోవృద్ధుడు కోలుకుని సంబ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తాడు. 101 ఏళ్ల ‘మిస్టర్‌పి’ అనే వ్యక్తికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో గతవారం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే క్ర‌మంగా ఆయ‌న కోలుకుంటూ బుధ‌వారం ఆస్ప‌త్రి నుంచి ఇంటికి చేరారు. క‌రోనా బారిన ప‌డ్డ అనేక మంది ఇటాలీయ‌న్లు మృత్యువాత ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ ఎక్కువ‌గా వృద్ధులు, చిన్నారుల‌పై ప్ర‌భావం చూపి వారి ప్రాణాల‌ను బ‌లిగొంటుందని వైద్యులు  చెబుతున్నారు. వైద్యులు చెప్పిన‌ట్లుగానే ఇట‌లీలో వంద‌లాదిమంది వృద్ధుల ప్రాణాలు గాలిలో క‌లిశాయి.

 

ఇక ‘కరోనా వైరస్‌ విజృంభణ గురించి గత కొన్ని వారాలుగా విషాద గాధలు వింటున్నాం. వృద్ధులపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఆయన కోలుకున్నారు. ‘మిస్టర్‌ పి’ జీవించే ఉన్నారంటూ ఆయ‌న బంధువులు, కుటుంబ‌స‌భ్యులు ఉద్వేగంతో వెల్ల‌డించారు.  భరోసా కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈ పరిణామం మాకెంతో బలాన్ని ఇచ్చింది. వందేళ్లు పైబడిన వారు కూడా కరోనాను తట్టుకుని నిలబడగలరన్న నమ్మకాన్ని ఆయన కలిగించార’ని రిమిని నగర డిప్యూటీ మేయర్‌ గ్లోరియా లిజి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో కకావికలమైన ఇటలీతో పాటు ప్రపంచానికి ‘మిస్టర్‌ పి’ ఇప్పుడు ఆశాదీపంగా మారారు అంటూ కొనియాడారు. 

 

తాజా సమాచారం ప్రకారం ఇటలీలో 80,589 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8,215 మంది ప్రాణాలు కోల్పోయారు.   ఇదిలా ఉండ‌గా ఫ్రాన్స్‌లో  కరోనా వైరస్‌ బారిన పడి 16 ఏళ్ల బాలిక మృతిచెందింది.  ఆ దేశంలో  కరోనా కారణంగా మృతి చెందిన అతి పిన్న వ‌య‌స్కురాలు జులీయే కావ‌డం గ‌మ‌నార్హం. జూలీకి వారం క్రితం కరోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరింది. చిన్నపాటి దగ్గుతో లక్షణాలు మొదలయ్యాయి. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఫ్రాన్స్‌లో చాప‌కింద నీరులా క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. రోజుకో మ‌ర‌ణం చోటు చేసుకుంటుడ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: