మాన‌వాళిని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఇప్పుడు వైద్యులు సూచిస్తున్న‌ది ఒక్క‌టే ఇంటికి ప‌రిమితం అవ‌డం. దాన్నే సెల్ఫ్ క్వారంటైన్‌గా వైద్యులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా  వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉంటుంది. క‌రోనాకు ముందు అస్స‌లు ఎంత‌మాత్రం పెద్ద‌గా వాడుక‌లో లేని ప‌దంగా చెప్పాలి. కానీ ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తిధ్వ‌నిస్తున్న ఆరోగ్యం మంత్రం అదే. అయితే క్వారంటైన్‌కు గురించి క్రోయేషియాలోని డుబ్రావ్నిక్‌ అనే పట్టణం ఓ కొత్త విష‌యాన్ని తెలియ‌జేస్తోంది. వాస్త‌వానికి ఈ విష‌యం అక్క‌డి వారికి పాతే అయినా ప్ర‌పంచానికి కొత్తేగా మ‌రి.  

 

క్వారంటైన్ గురించి  మనం మొదటిసారి వింటున్నాం. కానీ యూరప్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్‌ను అమలు చేశార‌ని తెలుస్తోంది. క్వారంటైన్‌ కోసమే ప్రత్యేకంగా ఎత్తైన గోడలు, విశాలమైన గదులతో ప్రత్యేక క్వార్టర్లు నిర్మించారు. ఆ క్వార్టర్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండ‌టం విశేషం. క్రోయేషియాలోని డుబ్రావ్నిక్‌ అనే పట్టణంలో క్వారంటైన్ గ‌దులు ఉన్నాయి. అయితే రోగుల‌ను ప్ర‌త్యేకంగా ట్రీట్ చేసేందుకు ఏకంగా మంచి వ‌స‌తుల‌తో కూడిన క్వార్టర్లను నిర్మించ‌డం విశేషం. మధ్యదరా సముద్రం ఒడ్డున ఒక దీవిలా ఉండే ప్రదేశంలో ఈ  క్వార్టర్లు ఉంటాయ‌ట‌. 

 

14వ శతాబ్దంలో యూర‌ప్‌లోని చాలా దేశాల‌కు  ప్లేగు వ్యాధి ప్ర‌బ‌ల‌డంతో వారందరినీ క్వారంటైన్‌లో పెట్టడం కోసం వీటిని నిర్మించార‌ని తెలుస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఆ రోజుల్లోనే ఈ విధానం అమలు చేశార‌ట‌. వాస్త‌వానికి మొదట్లో ఈ దీవిలో క్వార్టర్లు ఉండేవి కావ‌ట‌. ప్లేగు వ్యాధి బారినపడిన వారిని క్వారంటైన్‌ చేయడం కోసం ఈ దీవికి తెచ్చి వదిలేసే వారు. ఆ తరువాత కాస్త నీడైనా కల్పించాలనే ఉద్దేశంతో క్వార్టర్లు నిర్మించార‌ట. అయితే ప్లేగు వ్యాధి ప్ర‌బ‌లి యూర‌ప్ దేశాల్లో అప్పుడు కూడా వేల సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం జ‌రిగిన‌ట్లు విషాద రోజులను ఇప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నార‌ట‌. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: