ఆరోగ్యం ఉండాలంటే.. పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నేటి స‌మాజంలో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య నిద్ర‌లేమి. నిద్రలేమి ఉన్న వ్యక్తులు నిద్రలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది.  సాధారణంగా పగటి నిద్రపోవడం, నిద్రాణస్థితి, మానసికంగా మరియు భౌతికంగా అనారోగ్యంగా ఉండటం, అనేది నిద్రలేమికి దారి తీస్తుంది. అంతేకాకుండా, పడుకునే ముందు క్రమం తప్పకుండా మద్యం సేవించే అలవాటును కలిగి ఉండడం, లేదా కెఫిన్ ఆధారిత పానీయాలు తీసుకోవడం వంటివి కూడా నిద్రలేమికి అత్యంత సాధారణ కారణాలుగా చెప్పవచ్చు.

 

కాబ‌ట్టి ముందుగానే దీన్ని నివారించ‌క‌పోతే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా ఈ నిద్రలేమి సమస్య వల్ల‌ తలా నొప్పి, చూపు మందగించడం, మతిమరుపు, ఇలా చాలా సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు అర‌టి ఆకుతో చెక్ పెట్ట‌వ‌చ్చు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. అందుకు ముందుగా అరటి ఆకులు రెమ్మలో క‌ట్ చేసి తీసుకోడాలి.

 

దీన్ని శుభ్రంగా నీటిలో కడిగి.. పావు లీట‌ర్ నీటిలో ఐదు నిముషాలు మరిగించాలి. ఇప్ప‌డు దీన్ని రాత్రి భోజనానికి అర‌గంట‌ ముందు, అలాగే భోజనం అయిన అర‌గంట త‌రువాత త్రాగండి. ఇలా ఒక వారం నుండి రెండు వారాలు తాగితే నిద్రలేమి సమస్య మాయమైపోతుంది. కాగా, అర‌టి ఆకులో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఈ పచ్చని ఆకుల్లో వేడివేడి పదార్దాలు అన్నం వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలీ ఫెనాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఇది అనేక రుగ్మతల నుంచి పరిరక్షించ గల‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: