కరోనా అంటే సహజంగా వచ్చే వైరస్ లాంటిదే. కానీ దీని ప్రభావం శరీరంలో ప్రభావవంతంగా చూపిస్తోంది. కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ వైరస్ బారిన పడే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. ఒక వేళ ఈ వైరస్ సోకినా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు సైకాలజిస్టులు. అదేంటి కరోనా వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదని అంటారు ఏంటి అనుకుంటున్నారా.. సైకాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం...

 

IHG

మేము చెప్పినట్టు చేస్తే ఎంతో సులభంగా ఈ వైరస్ బారినుంచీ బయటపడచ్చని అంటున్నారు. రోగానికి సగం మందు ఆందోళనే అనే విషయం అందరికి తెలిసిందే. అయితే రోగం వచ్చినప్పుడు సంతోషంగా, పాజిటివ్ గా ఉంటే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుందని, ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి చెరిత్ అంతగా వైరస్ ని శరీరం ఎదుర్కుంటుందని అంటున్నారు. ఇదే ఫార్ములా కరోనా వైరస్ కి కూడా పనిచేస్తుందని  సైకాలజిస్టులు చెప్తున్నారు.

IHG

శరీరం ఎంతో ఉత్తేజంగా, పాజిటివ్ గా ఉన్నప్పుడు మన శరీరంలో కణాలన్నీ ఉత్తేజంగా ఉంటాయి. ఈ క్రమంలోనే శరీరంలోని మంచి బ్యాక్టీరియా సైతం ఎంతో బలంగా మారుతుందని తద్వారా శరీరంలో ప్రవేశించే చెడు వైరస్ లపై మంచి బ్యాక్టీరియా పోరాడి కరోనా వైరస్ ని నసింప చేస్తుందని అంటున్నారు. అందుకే కరోనా సోకినా వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలని సూచిస్తున్నారు. మరి పాజిటివ్ గా ఉండాలంటే ఏమి చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం..

 

  • కామెడీ వీడియోలు చూడటం మంచిది. యూట్యుబ్ లో వీటికి కొరతే లేదు.
  • ప్రకృతిని ఆశ్వాదించండి, పక్షులు, మొక్కలు , చిన్న పిల్లలు ఆడుకుంటున్న సందర్భాలు ఇలా మనసుకి హాయిని ఇచ్చేవి చూడండి.
  • కొన్ని కొన్ని ఉపద్రవాల నుంచీ బయటపడిన వారి గురించి తెలుసుకొండి, క్యాన్సర్ , మరే ఇతర జబ్బుల బారిన పడిన వారు వారి విజయానికి కారణాలు చెప్పిన సందర్భాలు ఉంటాయి. వాటిని ఒక్క సారి చదవండి.
  • యోగా, ఫిట్ నెస్ ఎక్సర్సైజులు చేస్తే శరీరంలో రోగ నిరోధకత శక్తి పెరుగుతుంది కాబట్టి తప్పకుండా వాటిని పాటించండి.
  • ఏదైనా కొత్త కొత్త విషయాల్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేయండి.
  • మంచి వ్యక్తులు చెప్పే సూక్తులు వినండి.
  • దేశ భక్తుల గాధలు వినండి, వారి వారి త్యాగాల విషయాలు తెలుసుకొండి.
  • ముఖ్యంగా కరోనా మరణాలు, కేసులు ఇలాంటి సంఘటనలు వినకండి, జాగ్రత్తలు, తీసుకునే పద్దతులు గురించి మాత్రమే తెలుసుకోండి.
  • స్వయంగా వంట చేయడం, మొక్కలు పెంచడం, మొక్కలకి నీళ్ళు పోయడం వంటి పనులపై దృష్టి పెట్టండి.

 

చివరిగా...మనం చాలా వీక్ గా ఉంటే వైరస్ మనల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజ పరుచుకొండి. ఎలాంటి జబ్బుని అయినా జయించే మొదటి మంది మనో ధైర్యమేనని గుర్తు పెట్టుకోండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: