ఆ ఒక్క‌డు చేసిన నిర్ల‌క్ష్యం ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది. ఉన్న‌త‌విద్యావంతుడై ఉండి కూడా ఏమాత్రం సామాజిక బాధ్య‌త‌లేకుండా ప్ర‌వ‌ర్తించిన స‌ద‌రు యువ‌కుడిని జ‌నాలు తిట్టిపోస్తున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉన్నయువ‌కుడు బ‌హ‌మాస్ నుంచి న్యూయార్క్ మీదుగా ముంబైకు చేరుకున్నాడు. అనంత‌రం మార్చి 22వతేదీన అక్కడి నుంచి గోవాకు విస్తారా విమానయాన సంస్థకు చెందిన యూకే 861 నంబరు ముంబై-గోవా విమానంలో ప్రయాణించాడు. అక్క‌డి నుంచి  గోవాకు రోడ్డు మార్గం ద్వారా  ప‌య‌న‌మ‌య్యాడు. అయితే యువ‌కుడిలో క‌రోనా ల‌క్ష‌ణాల‌ను గుర్తించిన అక్క‌డి వైద్యులు వెంట‌నే ఆసుప‌త్రిలో చేర్పించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో అత‌డికి ఆదివారం వెల్ల‌డైన వైద్య ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని తేలింది. 

 

ఇప్పుడు స‌ద‌రు యువ‌కుడితో స‌న్నిహితంగా ఉన్న‌వారిని, అత‌ని కుటుంబ స‌భ్యులను, విమానాల్లో ప్ర‌యాణించిన వారి వైద్య ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించే ప‌నిలో వైద్యులు నిమ‌గ్న‌మై ఉన్నారు. ఇందులో కొంత‌మంది ప్ర‌స్తుతం గోవాలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.  అప్ర‌మ‌త్త‌మైన గోవా ఆరోగ్య శాఖ మార్చి 22న యూకే861 విస్తారా విమానంలో ఉన్న మిగ‌తా ప్ర‌యాణికుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో వెంటనే కరోనా రోగి ప్రయాణించిన విమానం నడిపిన పైలెట్‌, కో పైలెట్లతో పాటు విమాన సిబ్బంది అందరూ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని విస్తారా ఎయిర్ లైన్స్ ఆదేశించింది. ఆ విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తికి కోవిడ్‌-19 సోకింద‌ని, దీంతో అందులోని ప్ర‌యాణికులంద‌రూ వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని సూచించింది.

 

వీలు కాని వాళ్లు 0832-24218102225538 హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని గోవా ఆరోగ్య శాఖ కోరింది. విమాన సిబ్బందిని సైతం స్వీయ నిర్బంధంలో ఉండాల‌ని కోరింది. అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్పుడు వెంట‌నే యువ‌కుడు జాగ్ర‌త్త ప‌డి ఉంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈస్థాయిలో ప్ర‌మాద ఘంటిక‌లు ఉండేవి కావ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విమానాల్లో ప్రయాణిస్తూ దేశదేశాలు తిరిగొస్తున్న వారితోనే వైర‌స్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంద‌ని జ‌నాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారి వివ‌రాలు ముందుగా క‌నుక్కోవాల‌ని కోరుతున్నారు. ఇదిలా ఉండ‌గా దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. సోమవారం 1,071కు పెరిగాయి. 24 గంటల్లో 106 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: