ఇటలీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఆరుకోట్ల జ‌నాభా ఉన్న ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డి 13వేల మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. స‌గ‌టున రోజుకు వెయ్యి మ‌ర‌ణాలు శవాల కుప్ప‌లుగా ప‌డుతున్నాయి. ఇక‌ వైద్యం చేసేందుకు న‌ర్సులు, డాక్ట‌ర్లు కూడా చేతులు ఎత్తేస్తుస్తుండ‌టం గ‌మ‌నార్హం.  వైర‌స్‌కు పుట్టినిల్ల‌యిన చైనాను మ‌ర‌ణాల సంఖ్య‌లో ఈ చిన్న దేశం దాటేసింది. ఇట‌లీలో రోజురోజుకు ప‌రిస్థితి భ‌యానకంగా త‌యార‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతు న్నారు. 1.10ల‌క్ష‌ల పాజిటివ్ కేసులున్నాయి. వారంద‌రికీ చికిత్స అంద‌జేస్తున్నారు. అయితే చాలా మందికి స‌రైన వైద్యం అంద‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. 

 

పేష‌ట్ల సంఖ్య‌కు అనుగుణంగా వైద్య సిబ్బంది..డాక్ట‌ర్ల సంఖ్య లేక‌పోవ‌డం, వ‌స‌తి స‌క్ర‌మంగా లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో వైద్యం అంద‌డం లేద‌ని తెలుస్తోంది.  వైద్య స‌దుపాయాలు లేక‌పోవ‌డం, సిబ్బంది త‌దిత‌ర కార‌ణాల‌తో బ‌తికే అవ‌కాశం ఉన్న వారికి అది కూడా యువ‌త‌కే ప్రాధాన్య‌మిస్తూ వైద్యం చేప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. అనేక మంది వృద్ధుల ప్రాణాలు గాలిలో క‌లిసిపోతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి ద‌హ‌న సంస్క‌రాల‌కు కూడా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఈ యూరోపియన్ దేశంలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో అంతకు అంతకూ పెరుగుతోంది.  

 

బుధ‌వారం ఒక్కరోజులోనే ఇటలీలో దాదాపు 1100 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా కారణంగా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు. ఇట‌లీకి పొరుగు దేశాల నుంచి కూడా పెద్దగా సాయం అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ప‌రిస్థితి చేయి దాటిపోయింది. పాజిటివ్ కేసుల్లో ల‌క్ష‌ల్లోకి చేరుకుంటున్నాయి. దీంతో అధ్య‌క్షుడు ట్రంప్ ఏం చేయ‌లో అర్థం కాక త‌ల‌ప‌ట్టుకుంటున్నాడు. మ‌రోవైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు మందు క‌నుగోనేందుకు ముమ్మ‌రంగా ప‌రిశోధ‌న‌లు సాగుతూనే ఉన్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: