క‌రోనా ఎంత ప్ర‌మాద‌కారో ఇట‌లీ, అమెరికా, స్పెయిన్‌, జ‌ర్మ‌న్‌, మొన్న‌టి వ‌ర‌కు చైనా దేశాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. భార‌త్‌లో చాపాకింద నీరులా పాకిన ఈ అటు వ్యాధి.. మ‌రింత వేగంగా విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో జ‌నాలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఇప్పుడు గుజరాత్‌లోని సూరత్ సిటీలో ఒక్కసారిగా తీవ్ర కలకలరేగుతోంది. ఓ లాండ్రీ షాప్ ఓనర్‌కు కరోనా వైరస్ సోకవడంతో అక్క‌డి ప్రజలు వణికిపోతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన లాండ్రీ షాప్  67 ఏళ్లు ఉంటాడ‌. అతడిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

ముందుజాగ్రత్తగా బాధితుడి భార్య ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను, అతడి షాపులో పనిచేసే వ్యక్తికి కూడా క్వారంటైన్ సెంటర్‌కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. ఈ వ్యాధిగ్ర‌స్తుడికి ప‌ట్ట‌ణంలోని చాలామంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు.  ఇటీవ‌లి కాలంలో లాండ్రీ షాపు ఓన‌రు చాలా మంది కలిశాడు. అత‌డితో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న‌వారంతా ఇప్పుడు గుండెలు ప‌ట్టుకుంటున్నారు. వేలాదిమంది త‌మ‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లుతుండ‌టంతో వైద్యులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.  దాంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. లాండ్రీ షాప్‌కు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించింది. కాల‌నీలోని ప్ర‌జ‌లంద‌రినీ ప‌రీక్ష‌ల కోసం త‌ర‌లిస్తున్నారు.


 వీధుల్లో ప‌రిశుభ్ర‌త  కార్య‌క్ర‌మాల‌ను  పెద్ద ఎత్తున చేప‌డుతోంది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాట్లు చేసిన వీధులన్నీ మూసివేశారు.  ఏకంగా 54 వేల మంది స్థానికులను క్వారంటైన్‌‌కు త‌ర‌లించారు. 55 మెడికల్ టీమ్స్‌తో ఇంటింటి ఆరోగ్య స‌ర్వే చేప‌డుతున్నారు.  రాండర్ జోన్‌లో ఉన్న 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 52 ఇంటర్నల్ రోడ్లును శానిటైజ్ చేశారు. ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అధికారులు సూచిస్తున్నా..ఇటీవ‌లి కాలంలో లాండ్రీ షాపు య‌జ‌మానితో క‌ల‌సి మాట్లాడిన వారి సంఖ్య అధికంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, గుజరాత్‌లో ఇప్పటి వరకు 95 మందికి కరోనా వైరస్ సోకింది. బాధితుల్లో ఎనిమింది మంది చనిపోయారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: