కరోనా వైరస్ దేశంలో ఉగ్ర‌రూపం చూపుతోంది. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3వేల మార్కును దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66మంది చ‌నిపోగా శుక్ర‌వారం ఒక్క‌రోజే 16మంది ప్రాణాలు విడిచారు.  గ‌త మూడు రోజులుగా కేసుల సంఖ్య రెట్టింపు అవుతూ వ‌స్తోంది. శనివారం ఉద‌యం నాటికి  కేసులు సంఖ్య అమాంతం పెరిగిపోయింది. తబ్లీగ్ జమాత్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునే ఉన్నాయి. కరోనా వైరస్ రెండో దశ దాటి సామూహిక వ్యాప్తి దిశగా సాగుతుండ‌టం కేంద్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతోంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 86 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 26 మంది, తెలంగాణ 11, మధ్యప్రదేశ్ 8, గుజరాత్ 9, ఢిల్లీ 6, పశ్చిమ్ బెంగాల్ 6, పంజాబ్ 5, ఢిల్లీ 4, కర్ణాటక 4, జమ్మూ అండ్ కశ్మీర్ 2, ఉత్తర ప్రదేశ్ 2, కేరళలో 2, హిమాచల్ ప్రదేశ్‌ 2, ఏపీ, బీహార్, తమిళనాడు,లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

 

కొత్త‌గా వేలాది మంది క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. దీంతో క‌రోనా చ‌ర్య‌ల‌కు, వైద్యానికి ఇబ్బందులు ఏర్ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని వైద్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీకి వెళ్లి వచ్చిన మర్కజ్‌ ప్రతినిధుల్లోనే అత్యధికంగా కరోనా వైరస్‌ కేసులు నిర్ధారణ అవుతుండడం భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. శుక్రవారం ఏకంగా 600కిపైగా కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం.  అలాగే దేశవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఒక్క రోజే కొత్తగా 647 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 65 శాతం మంది తబ్లీగ్ జమాత్ ప్రార్థనలకు హాజరైనవారే ఉన్నారు.  

 

మర్కజ్‌ నుంచి వచ్చిన వారిని, ఆ వ్యక్తులతో కలిసిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి, పరీక్షలు నిర్వహించాలని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారి చేసింది. తెలంగాణలో రోజురోజుకూ కేసుల సంఖ్య  పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 70 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు సంఖ్య 229కి చేరుకున్నాయి.  మహమ్మారికి శుక్రవారం మరో ఇద్దరు బలయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మహిళ ఒకరు కాగా, మరొకరు సికింద్రాబాద్‌ వ్యక్తిగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 11కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం రాత్రికి కోవిడ్-19 కేసులు 164కు చేరుకున్నాయి.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: