కీర నీళ్లు తాగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసా? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? మన శరీరంలో ఉండే మలినాలను బయటకు పంపడానికి చాలా మార్గాలే ఉన్నాయ్.. అయితే కీర నీళ్లు ఎన్నో మలినాలు బయటకు పంపుతాయి. అంతేకాదు కీరదోస నీళ్లు తాగడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కీరను పలుచని ముక్కలుగా కోసి తాగే నీళ్లలో వేసి అరగంటయ్యాక తాగితే మంచిది. 

 

ఈ కీర దోస నీళ్లు రోజూ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది. 

 

దోసలో విటమిన్లూ, మినరళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 

బరువు తగ్గించడంలో ఈ నీళ్లు ఎంతో బాగా పని చేస్తాయి. అంతే కాదు ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టనిండినట్టు అనిపిస్తుంది. 

 

ఈ కీర నీళ్లలో విటమిన్‌-కె, మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి.

 

ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి మాంగనీసు, బీటాకెరోటిన్‌ గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: