భూమండ‌ల‌మంతా విస్త‌రించిన క‌రోనా రోజురోజుకు మ‌రింత‌ వ్యాప్తి చెందుతూ ప్రాణాల‌ను బ‌లిగొంటోంది. డ‌బ్య్లూహెచ్‌వో విడుద‌ల చేసిన క‌రోనా లెక్క‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో అమెరికాలో  క‌రోనా వ్యాప్తి అధిక‌మైంది. ఇట‌లీలో కూడా అంతే. భార‌త్‌లోనూ వేగంగా విస్త‌రిస్తోంది. స్పెయిన్‌లో కొద్దిగా త‌గ్గ‌ముఖం ప‌ట్టిన మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌టం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. అమెరికాలో ఒక్క రోజులో 33072 కేసులు  న‌మోద‌య్యాయి.  మొత్తం కేసుల సంఖ్య 310233గా  ఉండ‌గా,  ఒక్క రోజులో 1040 మంది మ‌ర‌ణించారు.

 

 దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో క‌రోనా కార‌ణంగా మృతిచెందిన వారి సంఖ్య 8444గా ఉంది. ఇక స్పెయిన్‌లో కొత్తగా 6969 కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 126168 అయ్యాయి. కొత్తగా 749 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 11947కి చేరింది. ఇటలీలో శనివారం కొత్త‌గా 4805 కేసులు న‌మోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 124632 చేరుకుంది. శనివారం కొత్తగా 681 మంది చనిపోవడంతో... మొత్తం మృతుల సంఖ్య 15362కు చేరుకుంది. భార‌త్‌లో క‌రోనా లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే ఈవిధంగా ఉన్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3072గా నమోద‌య్యాయి.

 

213 మంది రిక‌వ‌రీ కావ‌డంతో వారిని డాక్ట‌ర్లు ఇళ్ల‌కు పంపించారు. ఈ పరిణామం భార‌త్‌లో కొంత ఆశాభావాన్ని పెంపొందిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 75గా ఉంది. ఇక తెలంగాణలో అనధికారికంగా పాజిటివ్ కేసుల సంఖ్య 272గా ఉండగా... అధికారికంగా ఇది 159గా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య అనధికారికంగా 192గా ఉండగా... అధికారికంగా ఇది 161గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్, బ్రెజిల్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, స్వీడన్, నార్వే,  జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఇరాన్, బ్రిటన్, టర్కీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్,ఆస్ట్రేలియా, రష్యా, ఐర్లాండ్, చిలీ, డెన్మార్క్, పోలాండ్, రొమేనియా, మలేసియా, ఈక్వెడార్, జపాన్, ఫిలిప్పీన్స్‌, కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: