కొందరికి నిద్ర బాగా ఉంటుంది.. బాగా అంటే కొంచం సమయం దొరికితే చాలు నిద్ర వచ్చేస్తుంది. తినగానే నిద్ర వస్తుంది.. అలా పడుకొని టీవీ చూద్దాం అని పడుకుంటే.. పడుకున్న పది నిమిషాలకే నిద్రలోకి జారుకొంటారు.. మరికొందరికి నిద్ర అసలు ఉండదు.. అదేం అంటే? అది అంతే అంటారు.. 

 

రాత్రి 1 గంట అయినా సరే వారు ఇంకా ఫోన్ లోనే ఉంటారు.. టీవీ చూస్తూనే ఉంటారు.. అవి రెండు లేకపోయినా సరే కళ్ళు తెరుచుకొని ఫ్యాన్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు.. ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కొందరికి నిద్ర రాదు.. కడుపు నిండా తిన్నప్పటికీ నిద్ర రాదు.. ఇంకా అలా కాదు అని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటే ఆ ఒక్క రోజు నిద్ర వస్తుంది.. ఆతర్వాత మళ్లీ మాములే.. 

 

అలాంటి వారు మన పూర్వికులు చెప్పిన చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్ర బాగా వస్తుంది. మరుసటి రోజు లేచి ఇంతలా నిద్రపోయిన అని అనిపించేలా నిద్ర పడుతుంది.. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..  

 

కొద్దిగా వేడి చేసిన గసగసాలను బట్టలో మూట కట్టి వాసన చుస్తే నిద్ర బాగా పడుతుంది.

 

కురాసాని వామును నిప్పులపై వేసి పొగను పీలిస్తే నిద్ర బాగా పడుతుంది.

 

తీ రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి నిమ్మకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్ర మాత్రమే కాదు శరీరం కూడా బాగా తగ్గి ఆరోగ్యవంతులు అవుతారు. 

 

పడుకునేటప్పుడు వేడి పాలలో కొంచెం తేనే వేసుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది.

 

మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ చిట్కాలు పాటించి మంచి నిద్రతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: