రోజులు గ‌డిచే కొద్దీ క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన కొత్త ల‌క్ష‌నాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప్రాణాంత‌క అంటు వ్యాధికి సంబంధించిన ఎన్నో ల‌క్ష‌ణాల‌ను క‌నుగొన్న వైద్యులు ఇప్పుడు మ‌రో ల‌క్ష‌ణాన్ని గుర్తించారు. అదే సైలెంట్ మోడ్‌లో ఉంటూ శ‌రీరంలో విస్త‌రించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌గా గుర్తించారు. సాధార‌ణంగా క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు వారం నుంచి గ‌రిష్ఠంగా 14రోజుల్లోపు బ‌య‌ట‌ప‌డుతుంటాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వైద్యులు చెబుతున్న మాట. అయితే తాజాగా కరోనావైరస్‌కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌ వచ్చిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.


వీరిద్ద‌రిలో ఒక‌రికి దేశంలోనే నివాస‌ముంటున్న వ్య‌క్తి కాగా మ‌రోక‌రు విదేశాల నుంచి ఇండియాకు వ‌చ్చిన‌వారు. ఇందులో దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన వ్య‌క్తికి 60 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంది.  ఢిల్లీకి వెళ్లి వచ్చిన  విద్యార్థినికి 19 సంవత్సరాలుంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు.  తిరువనంతపురానికి 100 కిమీ దూరంలోని పథనంతిట్ట జిల్లాలో ఈ రెండు కేసులు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం.  ఈ రెండు కేసుల్లో వ్యాధికి సంబంధించిన ఎలాంటి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌లేదు. వందల మందితో వీరు సన్నిహితంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్ద‌రితో స‌న్నిహితంగా ఉన్న వారిని ప‌ట్టుకునే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. 

 

60 సంవత్సరాల వ్యక్తి మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ క్వారంటైన్‌లో ఉన్నారని, ఆయన షార్జా నుంచి తిరువనంతపురానికి విమానంలో వచ్చి రోడ్డు మార్గంలో తన స్వస్ధలానికి వెళ్లారని అధికారులు చెబుతున్నారు. ఇక​ 19 ఏళ్ల విద్యార్థిని మార్చి 15న ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరి 17న ఎర్నాకుళంలో దిగారని, అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. వాస్త‌వానికి జ‌ర్నీ హిస్ట‌రీ ఉండ‌టంతో వీరిద్ద‌రిని  అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. ఎటువంటి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డ‌క‌పోవ‌డంతో 14 త‌ర్వాత  రోటీన్ టెస్టుల్లో పాజిటివ్ రావ‌డంతో అధికారులు అల‌ర్ట్ అయ్యారు. తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లాలో కూడా ఇలాంటి త‌ర‌హా ఒక కేసు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: