క‌రోనా నివార‌ణ‌కు మందును క‌నుగొనేందుకు ప్ర‌పంచ దేశాల్లోని శాస్త్ర‌వేత్త‌లు రేయిబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాల బ‌ట్టి నివార‌ణ‌కు మందుల‌ను క‌నుగోనే విశేష కృషి జ‌రుగుతోంది. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగానే  ఆస్ట్రేలియాలో జరిపిన ఈ పరిశోధనపై యాంటీవైరల్ రీసెర్చ్ జర్నల్ తాజా సంచికలో సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. దాని ప్రకారం...ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ప్ర‌యోగంలో 'ఐవర్‌మెక్టిన్‌ను క‌రోనా వైర‌స్పై ప్ర‌యోగించగా కేవ‌లం 24గంట‌ల్లోనే చంపేసిన‌ట్లు పేర్కొంది. అయితే ఈ ప్ర‌యోగాన్ని ల్యాబ్‌లోనే వైర‌స్ ఉన్న ప‌రీక్ష నాళిక‌లో మందును విడుద‌ల చేసి జ‌ర‌ప‌డం జ‌రిగింద‌ని తెలిపింది. 

 

అయితే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌, మ‌నుష్యుల‌పై ప్ర‌యోగా అనంత‌రం స‌త్ఫ‌లితాలిస్తే పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయ‌ని పేర్కొంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌యోగ ఫ‌లితాలపై శాస్త్ర‌వేత్త‌లు సంతృప్తిక‌రంగా ఉన్న‌ట్లు పేర్కొంది.    పరీక్షనాళికలో వైర‌స్పై ఈ మందును ప్ర‌యోగించిన‌ట్లు తెలిపింది. ప‌రీక్ష నాళిక‌లో వైర‌స్‌ను ఉంచి దానిపై    'ఐవర్‌మెక్టిన్స మందును ప్ర‌యోగించిన‌ప్పుడు కేవ‌లం ఒకే ఒక్క డోసుతో 24 గంటల్లో వైరస్ ప్ర‌భావం త‌గ్గిపోయింద‌ని వివ‌రించింది. అదే 48 గంటల్లో అయితే ఈ మందు వైరస్‌ను పూర్తిగా అంతం చేసిందని.. నివేదిక సహ రచయిత ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన కైలీ వ్యాగ్‌స్టాఫ్ క‌థ‌నంలో తెలిపారు.


ఈ మందు ఇంత‌కు ముందు హెచ్ఐవీ, డెంగ్యూ, ఇన్‌ప్లూయంజా, జికా వైరస్ వంటి వాటిపై బాగా పనిచేస్తుందని రుజువైంది. క‌రోనా విష‌యంలో తాము పరీక్షలు జరిపింది పరీక్ష నాళికలో మాత్రమే అని, దాన్ని మనుషులపై ప్రయోగించాల్సి ఉందని కైలీ చెప్పారు. ఇంకా మరికొన్ని టెస్టులు.. క్లినికల్ ట్రయిల్స్, మరిన్ని సందేహాలు తీరిన తరువాతనే కరోనాను కంట్రోల్ చేసే మందు బయటికి వస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే క‌రోనాకు సాధ్య‌మైనంత వ‌ర‌కు మందును క‌నుగొన‌కుంటే మాత్రం ఈ మ‌హ‌మ్మారి మాన‌వాళిని మ‌ట్టుబెట్ట‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: