చాలామంది వేసవికాలంలో సబ్జా గింజలు తీసుకుంటారనే విషయం తెలిసిందే.వైద్యులు, నిపుణులు సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. తులసి జాతికి చెందిన సబ్జాగింజలతో వైరస్ లక్షణాలకు చెక్ పెట్టవచ్చు. ఈ గింజల్లో ఉండే ఔషధ గుణాలు, అద్భుతమైన పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉండే సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే సులభంగా నమలవచ్చు. 
 
ఈ గింజలను వేడి నీటిలో నానబెట్టి తింటే జీర్ణక్రియ వేగవంతం కావడంతో పాటు శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఈ గింజలలో ఉండే యాంటిస్పాస్మోడిక్ దగ్గును నియంత్రించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే వైసెనిన్, ఓరింటిన్, బీటా కెరోటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. 
 
 
గర్భిణీలు, చిన్నపిల్లలు మాత్రం వైద్యులసలహా మేరకు సబ్జా గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గింజలు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ కనీసం రెండు టీ స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవాలి. కనీసం 15 నిమిషాలు వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవాలి. శరీరంలోని వేడిని తగ్గించడంలో... ఉబ్బరం, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో... అసిడిటీ, గుండె మంటను తగ్గించడంలో సబ్జా గింజలు సహాయపడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: