మానవాళి ప‌ట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు.  కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే వేలాది మంది శాస్త్ర‌జ్ఞులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.అయితే క‌రోనాకు  రాబోయే ఆరు నెలల్లో  వ్యాక్సిన్  తయారు చేయగలమంటూ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ధీమాగా చెబుతోంది.  దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించ‌డం గ‌మ‌నార్హం. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి  తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. 

 

ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకొచ్చారని, ఇవి విజయవంతమైతే వ్యాక్సిన్ అనుకున్నస‌మ‌యానికంటే ఎంతో ముందుగా అందుబాటులోకి వస్తుందన్నారు.  మూడవ దశ ట్రయల్ అనంతరం  వ్యాక్సిన్ సిద్ధ‌మ‌వుతుంద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్‌ వరకు ఎంపిక చేసిన  వంద‌లాది మంది వ‌లంటీర్ల‌పై  పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఏదైనా కార‌ణం వ‌ల్ల కొద్దిగా ఆల‌స్య‌మైనా 2021 ప్రారంభం నాటికి మాత్రం త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ సిద్ధ‌మ‌వుతుంద‌ని పాట్రిక్ వాలెన్స్ ధీమా వ్య‌క్తం చేశారు. 

 

ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో 24 గంట‌ల్లోనే 591 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డంతో, ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా బాధితుల సంఖ్య 5,865 కు పెరిగింద‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  తాజా గ‌ణాంకాల ప్ర‌కారం  477 మంది  క‌రోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇలావుండగా, క‌రోనాపై పోరాటంలో ఇత‌ర దేశాల‌కు భార‌త్ స‌హాయం అందిస్తుంది. క‌రోనాకు వ్యాక్సిన్ లేదు. మ‌లేరియా నియంత్ర‌ణ‌కు వాడే హైడ్రాక్సి క్లోరోక్విన్  క‌రోనాపై స‌త్ఫ‌లితాలు ఇస్తుండంతో ఈ మెడిసిన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. క‌రోనా రోగుల ప్రాణాలు కాపాడ‌టంలో ప‌లు దేశాలు దీన్నే వాడుతున్నాయి.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: