ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెడ్ జోన్లు పెరుగుతున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాలో పరిస్థితి ఆందోళన కరంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో జనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మరికొన్ని కొత్త వార్తలు ప్రజలను ఆందోళన పెడుతున్నాయి.

 

 

కరెన్సీ మార్పిడి ద్వారా కరోనా వ్యాపిస్తుందన్న వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఉందా? లేదా ?అనే అంశంపై ఏపీ డీజీపీ ఒక వివరణ ఇచ్చాఉ. కరెన్సీ వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

కరోనా వ్యాప్తి చెందకుండా రెండు వారాల పాటు కరెన్సీ వాడకాన్ని తగ్గించాలంటూ పోలీసు శాఖ ప్రకటన జారీ చేసినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే డీజీపీ అలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా.. కరెన్సీ వాడకం తగ్గిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: