చిక్కుడుకాయలు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌సరం లేదు. ముఖ్యంగా గ్రామల్లో ప్రతి ఇంటి పెరట్లో చిక్కుడు పాదు కనువిందు చేస్తుంటుంది. ఇక చిక్కుడుకాయ‌తో చేసే వంట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎందుకంటే.. చిక్కుడు కాయలతో చేసే ప్రతివంటకం అత్యంత రుచికరంగా ఉంటుయి. అయితే చిక్కుడుకాయ రుచిలోనే కాదు.. మన శరీరానికి పోషకాలను అందించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చిక్కుడు కాయగురాల్లో చాలామంచిది. బీన్స్ ఉడికించి తెన్నా వేయించి తెన్నా మన శరీరానికి మేలుచేస్తాయి. వారానికి ఒకసారైనా తినాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు మ‌న ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

 

ఇవే కాకుండా చిక్కుడుకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. మ‌రి అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్ట‌డానికి ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల‌ గుండె ఆరోగ్యాగానికి కూడా చాలా మంచిది.  మ‌రియు చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం స‌మ‌స్య కూడా  తగ్గుముఖం పడతాయి.

 

అదేవిధంగా,  దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషధంలా పని చేస్తుంది. చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్‌ నిద్రలేమి సమస్యను తగ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రియు చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. అద్భుతమైన ఫైబర్ లెవల్స్ ఉండటంతో ఇది బరువు తగ్గాలి అనుకునేవారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. ఇక చిక్కుడులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. కాబ‌ట్టి ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌చిక్కుడుకాయ‌ల‌ను ఆ ఆహారంలో భాగంగా చేసుకోండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: