ఆవాలు..  వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లోనూ వాడ‌తారు.  ముఖ్యంగా ఈ ఆవాలు ఎక్కువగా భారతీయ వంటకాల్లో వాడతారు. అయితే చిటికెడుఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాకుండా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. మ‌రి అవేంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. పంటినొప్పితో బాధపడేవారికి ఆవాలు దివ్య ఔషధం. గోరు వెచ్చని నీటిలో కాసిన్ని ఆవాలు వేసి.. ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

 

ఆవాలలో విటమిన్ ఎ, సి, కెలు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలాకూడా పనిచేస్తాయి. అంతేకాకుండా ఆవాలు విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల్లో ఉండే కఫాన్ని ఆవాలు కరిగించేలా చేస్తుంది. కఫం, వాతం కారణంగా వచ్చే జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియాలకు ఆవాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రియు  ఆవాల పొడిని సలాడ్స్‌, సూప్స్‌ వంటి వాటిల్లో వాడుతారు. వీటిని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫంగస్, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తినడం ద్వారా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. వీటిలో ఉండే సల్ఫర్ శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ న్యూట్రలైజ్ చేస్తుంది.

 

అదేవిధంగా, ఆవాలు ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. శరీరంపై ఏర్పడే కురుపులు, దురదలకు ఆవ పొడితో చెక్ పెట్టవచ్చు. ఆవ మిశ్రమాన్ని వాటిపై రాయడం ద్వారా అవి తగ్గిపోతాయి. ఆవాల్లో ఉండే మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది. మ‌రియు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిసి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: