ఎండాకాలం వచ్చింది. మండుతున్న ఎండ‌లు స్టాట్ అయ్యాయి. ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఒక‌వైపు క‌రోనా వైర‌స్‌తో మ‌రోవైపు మండుటెండ‌ల వ‌ల్ల వ‌చ్చే ఉక్క‌పోత‌తో పిచ్చెక్కిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్నా.. సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఎండాకాలం వ‌చ్చిందంటే.. మనకు మార్కెట్లలో పుచ్చకాయలు, కమలాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. 

 

అంతేకాదు.. ఈ రెండు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేకూర్చుతాయి.  ముఖ్యంగా వీటిలో ఉండే సీ విటమిన్ సమ్మర్‌లో మ‌న ఆరోగ్యానికి ఎంతో అవసరం ఉంటుంది. మ‌రియు ఈ ఫ్రూట్స్ మన శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తాయి. ఇక సాధార‌ణంగా మనం మధ్యాహ్నం భోజనం చేశాక... రాత్రి భోజనం చేస్తాం. ఈ మధ్యలో చాలా మంది టీ తాగుతారు. కానీ, అలాకాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను తాగితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. ఇందుకు మ‌న‌కు కావాల్సింది పైన చెప్పిన పుచ్చకాయ, కమలాలతో పాటు పంచ‌దార‌, నిమ్మ‌రసం ఉంటే స‌రిపోతుంది. 

 

మ‌రి వీటితో జ్యూస్ ఎలాచేయాలంటే.. ముందుగా మిక్సీ జార్‌లో రెండు కప్పుల గింజలు లేని పుచ్చకాయ ముక్కలు, అర క‌ప్పు  కప్పు కమలాపండు రసం, రెండు స్పూన్ల పంచ‌దార మ‌రియు ఒక స్పూన్ నిమ్మ‌ర‌సం వేసి జ్యూస్‌లా చేసుకుంటే స‌రిపోతుంది. పంచదార వెయ్యకుండా తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. సాయంత్రం వేళ టీ బ‌దులు ఈ జ్యూస్‌ను తాగ‌డం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ శ‌రీరాంలోని వేడిని త‌గ్గించి.. చ‌ల్ల‌బ‌రుస్తుంది. మ‌న‌కున్న స్ట్రెస్‌ను త‌గ్గిస్తుంది.  సాయంత్రం వేళ పుచ్చకాయ, కమలం కాంబినేషన్‌లో జ్యూస్ తయారుచేసుకొని తాగమని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. కాబ‌ట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వ‌డం మంచిది. మ‌రియు ఈ జ్యూస్ ఎదిగే పిల్ల‌ల‌కు కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: