మ‌ల‌బ‌ద్ధ‌కం.. చాలా తరచుగా గాని, లేక అప్పుడప్పుడు గాని అందరినీ పలకరించిపోతూనే ఉంటుంది. నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఇది. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండాపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం, వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం వేధిస్తుంటుంది. అయితే  తరచుగా మలబద్ధక సమస్యని ఎదుర్కొంటున్న వారు మాత్రం ఖ‌చ్చితంగా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేకుండా అది ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.

 

మ‌రి ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డం ఎలా రా బాబు..? అని హైరానా ప‌డాల్సిన ప‌ని లేదు. ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటిస్తే ఈ స‌మ‌స్య‌కు ఈజీగానే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందులో ముందుగా ఉదయం నిద్ర లేవగానే ఒకటీ రెండు గ్లాసుల నీరు తాగాలి. ప్రతిసారి భోజనం చేయడానికి అర గంట ముందు.. భోజ‌నం చేసిన అర గంట తర్వాత కూడా నీరు తాగాలి. నిమ్మరసం, ఆముదంతో మలబద్ధక సమస్యను నివారించవచ్చు. దీనికి ఒక కప్పు నిమ్మరసంలో, ఒక టేబుల్ స్పూన్ ఆముదంను కలిపి నూనె అడుగున పేరుకోకముందే తాగండి. ఇలా చేయ‌డం మంచి ఫ‌లితం పొందొచ్చు.

 

అదేవిధంగా, ప్రతిరోజూ వాకింగ్ చేయడం, తగినంత నీరును త్రాగటం, ఫైబర్ను అధికంగా కలిగి ఉన్న ఆహారాలను తినడం, కూరగాయలను మరియు పండ్లను తినడం చేస్తే మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక లంచ్‌లో కాయగూరల సలాడ్‌ తప్పనిసరి. తొక్క ఉన్న గింజలతో కూర ఒకటి తప్పనిసరిగా ఉండాలి. స్నాక్‌టైమ్‌లో పళ్లుగానీ, మొలకెత్తిన గింజలు కానీ తినాలి. మ‌రియు మలబద్దకం నుండి బయటపడేందుకు మీ పొట్టపై ఆముదంతో మృదువుగా మర్దనా చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: