బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కరోనా వైరస్ నివార‌ణ వ్యాక్సిన్ గురువారం మాన‌వుల‌పై ప్ర‌యోగించారు. ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్‌ను జంతువుల‌పై ప్ర‌యోగించి స‌త్ఫ‌లితాలు రాబ‌ట్టిన ప‌రిశోధ‌కులు గురువారం తొలివిడ‌త‌గా 500మందిపై ప్ర‌యోగించారు. ఈ వ్యాక్సిన్ 80% మేర విజయం సాధించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు. చింపాంజీల్లోని ప్రమాదకరం కాని అడెనో వైరస్‌తో ఈ టీకాను తయారుచేసిన‌ట్లు ప‌రిశోధ‌న బృందం స‌భ్యులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌కు ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌ ఎన్‌కోవ్‌-19’ అని నామ‌క‌ర‌ణం  చేశారు. కరోనా వైరస్‌పై ఉండే కొమ్ము లాంటి ‘స్పైక్‌ ప్రొటీన్‌’కు సంబంధించిన జన్యుక్రమాన్ని ఇందులో చొప్పించారు.


ఈ టీకా ఇవ్వడం వ‌లన  స్పైక్‌ ప్రొటీన్‌ ఉత్పత్తి అవ‌డం మొద‌లుపెడుతుంది. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంతో పాటు నిర్ధారణ వ్యవస్థను ఇది తీర్చిదిద్ద‌డం దీని ప్ర‌త్యేక‌త‌గా చెప్ప‌వ‌చ్చు. ఈ టీకా రూపకల్పన కు ప్రొఫెసర్‌ శారా గిల్బెర్ట్‌ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జనవరి నుంచే పరిశోధన ప్రారంభించింది.  ఈప్ర‌యోగానికి బ్రిటన్‌ ప్రభుత్వం దాదాపు 2 కోట్ల పౌండ్ల ఆర్థిక సాయాన్ని  ప్రకటించింది. చింపాంజీల్లోని ప్రమాదకరం కాని అడెనో వైరస్‌తో ఈ టీకాను తయారుచేయ‌డం గ‌మ‌నార్హం. పూర్తి ఆరోగ్యంగా ఉన్న 18-55 ఏళ్ల లోపు వలంటీర్లకు ఈ టీకాను ఇస్తున్నారు. ప్రయోగాల కోసం దాదాపు 500 మంది వలంటీర్లను ఇప్ప‌టికే ఎంపిక చేయ‌డం పూర్త‌యింది.

 

వలంటీర్లలో ఎంత మేర వైరస్‌ వ్యాప్తి జరిగిందన్నదాన్ని బట్టి ఈ టీకా సమర్థతను నిర్ధరించడానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. టీకా పొందిన వలంటీర్లలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటే ఫలితాలు రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న వారినే ప్ర‌యోగాల‌కు ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య చాలా వ‌ర‌కు తగ్గిపోవ‌డంతో ఆ దేశ ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే చైనాలో మ‌ళ్లీ వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లుగా గ‌ణాంకాలు తెలియ‌జేస్తుండ‌టంతో గ‌మ‌నార్హం. ప్ర‌పంచానికి వ్యాక్సిన్ త‌యారు చేయ‌డానికి మించి వేరే గ‌త్యంత‌రం లేద‌ని స్ప‌ష్టమ‌వుతోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: