ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించాలంటే భౌతిక దూరం, వ్య‌క్త‌గ‌త శుభ్ర‌త పాటించ‌డ‌మే మార్గాలుగా క‌నిపించ‌డంతో ప్ర‌భుత్వాలు సైతం వాటి వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట కాలు పెట్ట‌కుండా క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక ఇంట్లో ఉంటున్న ప్ర‌జ‌ల్లో చాలా మంది బ‌రువు ఎలా త‌గ్గాల‌ని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి మ‌న వంటింట్లో ఉండే ల‌వంగాలే బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. అవును! ల‌వంగాల‌తో అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

అది ఎలా..? అందుకోసం ఏం చేయాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో పోష‌కాలు ఉన్న లవంగం నీరు జీర్ణక్రియను పెంచుతాయి. అలాగే శరీర అధిక బరువుకు చెక్ పెడుతుంది. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ సహాయపడతాయి. ఇందుకు ముందుగా రాత్రి గ్లాసు నీటిలో రెండు లవంగాల్ని వేసి తెల్లారే వరకూ నానబెట్టాలి. ఉదయం పరగడుపునే ఈ నీటిని తాగి లవంగాల్ని చప్పరించాలి. చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు లవంగం నీటిని తాగుతారు. అలాగే బరువు తగ్గాలంటే లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్రను రోస్ట్ చేసి, పౌడర్ చెసుకోవాలి.

 

ఈ పౌడర్‌ను ప్రతీ రోజూ ఉదయం గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగినా మంచి ఫ‌లితం పొందొచ్చు. అలాగే ల‌వంగాలు బ‌రువు త‌గ్గించ‌డంమే కాదు.. మ‌ర‌న్నో ఉప‌యోగులు ఉన్నాయి. వాస్త‌వానికి లవంగాలు చిన్నగా ఉన్నా... వ్యాధుల్ని తరిమికొట్టడంలో, విష పదార్థాల్ని శరీరంలోంచీ బయటకు పంపడంలో బాగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్‌ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తింటే చాలా మంది. ఎందుకంటే వాటిలోని మాంగనీసు మన ఎముకలను బ‌లంగా ఉంచేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: