క‌రోనా వైర‌స్ అనేది శ‌రీరంలోకి చొర‌బ‌డిన వెంట‌నే క్ర‌మ‌క‌మ్రంగా విస్త‌ర‌ణ ప‌నిని మొద‌లుపెడుతుంది. ముక్కుద్వారా మాన‌వుని శ‌రీరంలోకి చొర‌బ‌డుతున్న ఈ వైర‌స్‌..నాసిక రంధ్రాల గుండా అక్క‌డి నుంచి గొంతులోకి చేరుకుంటుంది. అక్క‌డి నుంచి పున‌రుత్ప‌త్తిని మొద‌లు పెడుతుంది. ఆ త‌ర్వాత క‌ణ‌జాలంలోకి వైర‌స్ త‌న స్పై ప్రొటీన్ ద్వారా చొచ్చుకెళ్తుంది. అక్క‌డి నుంచి క‌ణ‌జాలంలో విస్త‌రిస్తూ రోగ‌నిరోధ‌క శ‌క్తిని దెబ్బ‌తీయ‌డాన్ని ప్రారంభిస్తుంది. ఈ సమయంలో రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా.. చుట్టుపక్కల వారికి అతడి నుంచి వ్యాప్తి చెంద‌డం మాత్రం మొద‌ల‌వుతుంది. 

IHG

అత‌డు తుమ్మినా, ద‌గ్గినా అత‌డి నుంచి వెలువ‌డే తుంప‌ర్ల ద్వారా ఎదుటి వారు గాలి పీల్చుకునే క్ర‌మంలో వారి ముక్కుద్వారా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది.  వైరస్‌ గొంతులోకి ప్రవేశించిన తొలి దశలో మన రోగ నిరోధక కణాలు స్పందించకుంటే గాలిగొట్టం నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరగానే వైరస్‌ విజృంభ‌న మొద‌లవుతుంది.  అక్కడ లక్షల సంఖ్యలో ఉండే శ్వాసకోశాలను క్ర‌మంగా క‌రోనా వైర‌స్‌ ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో ‘న్యుమోనైటిస్‌’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల కండరాల్లో వాపు కనిపిస్తుంది. రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ప‌డుతూ మ‌ర‌ణించే శాతం పెరుగుతూ ఉంటుంది.  ఇదిలా ఉండ‌గా  కొవిడ్‌ రోగుల్లో బయటపడే సమస్యల మూలాలను గుర్తించేందుకు పరిశోధనలు జ‌రుగుతున్నాయ‌ని కింగ్స్‌ కాలేజ్‌ ఆసుపత్రి, లండన్  ప్రొఫెసర్‌ అజయ్ షా తెలిపారు. 

 

గుండెపోటు, రక్త ప్రసరణలో ఇబ్బందులు, మూత్రపిండాలు విఫలం కావడం వంటి సమస్యలను మేం గుర్తించాం. అయితే వైర‌స్ ఈ అవ‌య‌వాల‌పై ఏవిధంగా ప్ర‌భావితం చేస్తుంది అనేది వాస్త‌వానికి ఇప్ప‌టికీ ఒక అంచ‌నా మాత్ర‌మేనంటూ చెప్ప‌డం గ‌మ‌నార్హం. చాలా మంది రోగులు అయోమయంగా ప్రవర్తించ‌డం మేం గుర్తించాం. వారి మెదడులో ఏదో జరుగుతోందనే విష‌యం మాకు అర్థ‌మైంది.  వైరస్‌ నేరుగా మెదడుపై దాడి చేసైనా ఉండాలి.. లేదా శరీరంలో ప్రాణవాయు శాతం తగ్గడంతోనైనా అలా చేస్తుండాలి అనేది మా అంచ‌నా. అయితే రోగి వింత ప్ర‌వ‌ర్త‌న‌కు మాకు స్ప‌ష్టమైన‌, నిర్ధిష్ఠ‌మైన కార‌ణాలను మేం విశ్లేషించ‌లేకుపోతున్నామ‌ని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ది నుఫీల్డ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో క్లినికల్‌ న్యూరోసైన్సెస్‌ విభాగంలో ప‌నిచేస్తున్న  ప్రొఫెసెర్ డంకన్‌ యంగ్ తెలిపారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: