క‌రోనా నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో  భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న 13 అంతస్తుల భవనంలో 1500 బెడ్లతో ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)ను ఏర్పాటు చేసిన‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను వారం రోజుల క్రితం జారీ చేయ‌డం జ‌రిగింది.  క‌రోనా రోగుల‌కు, అనుమానితుల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు శాశ్వ‌తంగా ఉండాల‌ని ఈ భ‌వ‌నాన్ని కేటాయించింది. 

 

దానికి తోడు న‌గ‌రానికి నాలుగు దిక్కులా ఆస్ప‌త్రులు ఉండాల‌నే ఆలోచ‌న కూడా టిమ్స్ ఆవిర్భ‌వానికి వెనుక కార‌ణంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన విష‌యం తెలిసిందే. తాజా విష‌యానికి వ‌స్తే ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శనివారం రాత్రి జీవో.నెం.22 జారీ చేసింది. కరోనా ఆసుపత్రిగా ప్రారంభమైన టిమ్స్‌ను జాతీయ ప్రాధాన్యం గల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇక  టిమ్స్‌ అభివృద్ధి కోసం రూ.6.5 కోట్లు ఇచ్చింది. స్థానికంగా వైద్య సౌకర్యాల కోసం ఇప్పటికే రూ.18.50 కోట్లు ఖర్చుపెట్టింది. ఇప్పుడిచ్చిన డబ్బుతో స్పోర్ట్స్ రెస్ట్ హౌస్‌ను కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చుతారు.

 

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య శ‌నివారం త‌క్కువ‌గా న‌మోదుకావ‌డం ప్ర‌భుత్వానికి కొంత ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తోంది. వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గానే ఉంద‌న్న అభిప్రాయం వైద్య వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. మే3 త‌ర్వాత కొన్ని జిల్లాల్లో ష‌ర‌తుల‌తో కూడిన లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ స‌డ‌లింపున‌కు మొగ్గు చూపుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే దుకాణాల నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. జోన్ల ప‌ద్ధ‌తిలో లాక్‌డౌన్ స‌డ‌లింపు..నిర్భందాల కొన‌సాగింపు ఉంటుంద‌ని తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: