కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ఎంట్రీ ఇస్తే ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయో అందరికి తెలిసిందే. కరోన  శరీరంలోకి వెళ్ళిన తరువాత ముఖ్యంగా టార్గెట్ చేసేది ఊపిరితిత్తులని. ఈ అవయవంలో వైరస్ చేరిన తరువాత అది సృష్టించే భీకరమైన పోరులో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. శ్వాస తీసుకోవడానికి వీలు లేకుండా చేస్తూ ఆయాస పడుతూ మనిషి పడే ఆవేదన కష్టం అంతా ఇంతా కాదు. శరీరంలోకి ఈ వైరస్ వచ్చినా ఊపిరితిత్తులపై దాని ప్రభావం చూపకుండా వైరస్ ధాటికి తట్టుకునేలా ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇప్పుడు అందరికి ఇదే ఆలోచన..మరి ఊపిరితిత్తులను కాపాడుకోవడం ఎలా అంటే.

IHG

టమోటాలు, యాపిల్స్ తినడం వలన ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చట. గతంలోనే ఊపిరి తిత్తుల సమస్య ఉన్న వారికి కూడా ఉపశమనం కలుగుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు ఊపిరి తిత్తులు బలహీనంగా ఉన్నవాళ్ళు రోజు ఉదయం సాయంతం సమయాలలో నీరెండలో కనీసం 20 నిమిషాలు కూల్చోవాలని కూడా పరిశోధకులు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే  గతంలో ధూమపానం చేసిన సుమారు 1000 మందిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు.

IHG

ధూమపానం చేసిన 1000 మందిని రెండు గ్రూప్ లుగా విభజించి ప్రతీ రోజు మూడు టమాటాలు, మూడు ఆపిల్స్ ఇచ్చేవారట. వేరే గ్రూప్ కి సాధారణ ఆహరం ఇచ్చారట. కొన్ని రోజుల తరువాత ఈ రెండు గ్రూప్ లపై పరిశోధనలు చేయగా టమాటాలు, ఆపిల్స్ తిన్నవారిలో ఊపిరితిత్తులు బలంగా మారడం మొదలు పెట్టాయట. మిగిలిన రెండో గ్రూప్ వారికి ఊపిరితిత్తులలో మరింత బలహీనంగా మారడం గమనించారు. అయితే పరిశోధకుల అంచనా ప్రకారం టమాటాలు, ఆపిల్స్ కేవలం ఊపిరితిత్తులని పాడవకుండా కాపాడుతాయి కానీ ముందుగా ఉన్న సమస్యకి పరిష్కారం చూపలేవు అంటున్నారు శాస్త్రవేత్తలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: