ఆరోగ్యక‌ర‌మైన జీవితం గ‌డ‌పాలంటే.. ఎన్నో నియ‌మాలు పాటించాలి. అయితే నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా ప‌నులు చేస్తారు. కొంద‌రు బెడ్ కాఫీ లేదా టీతో ఉద‌యాన్ని ఆరంభిస్తే కొంద‌రు లేవ‌గానే ఫోన్‌కు అతుకుపోతుంటారు. ఆ త‌రువాత కొంద‌రు యథావిధిగా త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను చేసుకుంటారు. అయితే నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే ఆరోగ్య‌క‌ర‌మైన జీవితం మీ సొంతం అవుతుంది. అందులో ముందుగా ఉదయం నిద్రలేవగానే నోరు శుభ్రం చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.

 

ఈ హెల్తీ చిట్కా మీ మనస్సును మరియు శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది.  గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగితే బ‌రువు త‌గ్గ‌డానికి యూజ్ అవుతుంది. ఇక ఉదయం నడక లేదా చిన్న పాటి జాగింగ్ వల్ల త్వరగా బరువు త‌గ్గ‌డంతో పాటు రోజంతా ఎఫెక్టివ్ గా పనిచేయ‌గ‌లుగుతారు. మ‌రియు ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. అలాగే ఉదయం పూట తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే అల్పాహారం తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారంలో ఘాటైన మసాలాలూ, గ్రేవీ కూరలు అస్స‌ల తీసుకోకూడ‌దు. దీనివల్ల పొట్టలో తిప్పినట్లుండటం, రోజంతా నిరుత్సాహంగా ఉండే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

 

కాబ‌ట్టి ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి. ఆహారంతో తీసుకొన్నప్పుడు పొందే విటమిన్స్ మాత్రమే కాకుండా.. శరీరానికి మరో ప్రధానమైన విటిమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వల్ల పొందవచ్చు. అందుకు ఉద‌యం కాసేపు సూర్యరశ్మి ఎదురుగా ఉండండి. అదేవిధంగా, కొందరు ఉదయాన్నే నారింజ, బత్తాయి, టమోటో రసం తీసుకొంటారు. దీనివల్ల వాటిలోని ఆమ్లం ఎసిడిటీ, గుండెలో మంట, అల్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. సో.. ఉద‌యంపూట వీటికి దూరంగా ఉండండి. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: