క‌రోనా ప‌రీక్ష‌ల విష‌యంలో ఒకే ర‌క‌మైన విధానాన్ని అవ‌లంభించేలా కేంద్రం క‌ట్ట‌డి చ‌ర్య‌లు ఆరంభించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా టెస్టులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌పై అలా చేయ‌డానికి కుద‌ర‌ద‌ని, కోవిడ్-19 నిర్ధారణకు రియల్ టైమ్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్  (RT-PCR) టెస్ట్‌లు మాత్రమే చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం  తెలిపారు.  పలు రాష్ట్రాల్లో ర్యాపిడ్ కిట్లతో పాటు ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్ష లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వాటిలో పాజిటివ్ వస్తే కన్మర్మేషన్ కోసం RT-PCR పరీక్షలు నిర్వ‌హిస్తారు. అక్క‌డా కూడా  పాజిటివ్ వస్తే కరోనా సోకిందని నిర్ధారించేస్తారు. 


అయితే ఇక‌పై ఇన్ని అంచ‌లంచెలుగా కాకుండా నేరుగా క‌రోనా నిర్ధార‌ణ‌కు ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల‌నే నిర్వ‌హించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం ఆదేశించింది.ఇదిలా ఉండ‌గా క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వారికి,  పాజిటివ్‌గా తేలిన వారితో స‌న్నిహితంగా మెలిగిన ప్రైమ‌రీ కాంటాక్టులంద‌రికీ తాము ICMR ప్రొటోకాల్ ప్రకారమే RT-PCR ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న‌ట్లు మంత్రి ఈటల రాజేందర్ ప్ర‌క‌టించారు. అయితే  సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు టెస్ట్‌లు చేయబోమని.. ప్రైవేట్ ల్యాబ్స్‌లో పరీక్షలు చేస్తే కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోబోమ‌ని తెలిపారు. 


ఇదిలా ఉండ‌గా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. దీంతో విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే ప‌లువురు మంత్రులు మాట్లాడుతూ క‌రోనా ప‌రీక్ష‌లు దేశంలో ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌నంత వేగంగా ఎక్కువ సంఖ్య‌లో ఏపీలో జ‌రుగుతున్నాయ‌ని, అందువ‌ల్లే పాజిటివ్ కేసులు త్వ‌రిత‌గ‌తిన‌బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని స‌మ‌ర్ధించుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి మ‌రీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, కరోనా పరీక్షల విషయంలో ఏపీ టాప్ ప్లేస్‌లో ఉండ‌గా ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రం అధ‌మ స్థానంలో ఉంది.  అక్క‌డ వైద్య ప‌రీక్ష‌ల సంఖ్య జాతీయ స‌గ‌టు క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: