దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కొత్త పాజిటివ్  కేసులు వందల్లో నమోదు అవుతున్నాయి.  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసిన వివ‌రాల ప్ర‌కారం... దేశంలో ఇప్పటి వరకు 33,610 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కొత్తగా 560 కరోనా కేసులు రావ‌డం గ‌మ‌నార్హం.  మొత్తంగా 1,075 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందగా.. 8,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం తక్కువగానే ఉందని కేంద్రం తెలిపింది.

 

దేశంలో వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి 3.5 రోజుల పడితే.. ప్రస్తుతం అది 11.6 రోజులుగా ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌ల‌తో తెలిపింది.  అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా  పెరుగుతున్న‌ట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లవ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. రెండు వారాల క్రితం మన దేశంలో కోవిడ్ పేషెంట్ల రికవరీ రేటు 13.06 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25.19 శాతానికి చేరిందని లవ్ అగర్వాల్ గుర్తు చేశారు.  అయితే క‌రోనాపై పోరాటానికి కలిసి రావాలని రాష్ట్రాలకు కేంద్రం పిలుపునిచ్చింది. తెలంగాణలో సరిపడా టెస్టింగ్ కిట్లు, పీపీఈలు ఉన్నాయని హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర బృందం తెలిపింది.


ఇదిలా ఉండ‌గా ఇప్పటికే లాక్‌డౌన్ విధించి 40 రోజులు కావొస్తున్న నేపథ్యంలో మే 4 నుంచి గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తామనే సంకేతాలను కేంద్రం  పంపుతోంది. అయితే వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్లడానికి మోదీ సర్కారు అనుమతివ్వ‌డం ఇందులో భాగమేన‌ని స‌మాచారం. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోస‌మే లాక్‌డౌన్ త‌ర్వాత జ‌నాలు సామాజిక దూరం పాటించేలా గైడ్‌లైన్స్ విడుదల చేసేందుకు నిపుణులు క‌మిటీ నిమ‌గ్న‌మైంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: