ప్ర‌పంచాన్ని క‌రోనా ఇప్ప‌ట్లో విడిచిపోయేలా లేదు.రోజుకు వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను బ‌లిగొంటుకున్న ఈ ర‌క్క‌సి గురించి భ‌య‌ప‌డే వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.  క‌రోనా  వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని తేల్చిచెబుతున్నారు  పరిశోధకులు. 2022 వరకూ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు. ‘యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం’  క‌రోనాపై చేసిన అధ్య‌య‌నాల నివేదిక‌ను వెల్ల‌డించింది. ఈ రిపోర్ట్‌‌లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందికి రోగ నిరోధక శక్తి పెరిగేవరకూ ఇది మ‌న‌గ‌లిగే ఉంటుంద‌ని పేర్కొన్నారు.


 సహజంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఈ వైరస్ త్వ‌ర‌గా సోకే గుణాన్ని క‌లిగి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చినా దీన్ని అప్పుడే అదుపు చేయడం కుదరదని రిపోర్టులో తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించడానికి ముందే అంది సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్ ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండ‌గా కరోనా వైరస్ బారిన ప‌డిన ల‌క్ష‌మంది మంది ఐరోపియ‌న్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఒక్కో దేశంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అమెరికాతో పాటు ఐరోపాల‌ని బ్రిట‌న్, ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో ఎక్కువ‌గా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మృత‌దేహాలు గుట్ట‌లు గుట్ట‌లుగా ప‌డి ఉంటున్నాయి. బ్రెజిల్లో కూడా క‌రోనా విల‌యం కొన‌సాగుతోంది.

 

అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, మహమ్మారి మళ్లీ రాబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో  హెచ్చరించింది. అయితే సుదీర్ఘ‌కాలంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయే ప్ర‌మాదముంద‌ని హ‌డ‌లెత్తిపోతున్నాయి. ధైర్యం చేసి లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ముంద‌డుగు వేస్తున్నాయి. ద‌శ‌ల‌వారీగా ప్ర‌తిష్ఠంభ‌న‌ను తొల‌గించుకోవాల‌ని యోచిస్తున్నాయి. ఇప్ప‌టికే అమెరికా వ‌చ్చే వారం నుంచి అంత‌ర్గ‌త ప్ర‌యాణాల‌కు అనుమ‌తులిచ్చేసింది. ఇండియా కూడా జోన్ల విధానంలో నిబంధ‌న‌లు స‌డ‌లిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: