మామిడి పండ్లు.. పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంటుంది. సాలు, బంగినపల్లి, మల్గోబా, కలమామిడి ఇలా ఎన్నో ర‌కాల‌ మామిడి పండ్ల ఉంటాయి. అయితే ఒక్కో ర‌కంలో ఒక్కో టేస్ట్ ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. ముఖ్యంగా వేసవిలో వచ్చిందంటే మార్కెట్ లో మామిడి పండ్ల సందడి ఊపందుకుంటుంది. ఎందుకంటే.. ఈ కాలంలోనే మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. నాలుగు వేల సంవత్సరముల చరిత్ర కలిగి ఉన్న మామిడిపండ్లు ఈ మండే వేసవిలో తీసుకుంటే ఆ కిక్కే వేరు. వాస్త‌వానికి ప్ర‌పంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లకు మాత్రం చాలా ప్రత్యేకం. 

 

మంచి రంగు, రుచి, వాసనతో మనుషులను ఈజీగా ఆక‌ట్టుకుంటాయి. అందుకే పండ్లలో రారాజు మామిడి పండ్లు అని అంటుంటారు. అయితే ఈ మామిడి పండ్లు తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కొన్ని స‌మ‌స్య‌లు తెచ్చెపెడ‌తాయి. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. సాధార‌ణంగా మామిడి పండ్లు మితంగా తింటే పర్వాలేదు కానీ, ఓవ‌ర్‌గా తింటే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. ఒక మీడియం సైజు మామిడి పండులో వంద‌కు పైగా క్యాలరీలుంటాయి. ఒకే సారి ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు అమాంతం పెరుగుతారు. 

 

అలాగే మామిడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా సరిగ్గా మాగని పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్షనల్ కు సంబంధించిన అజీర్థ సమస్యలను ఎదుర్కొంటారు. మ్యాంగో మౌత్ అంటే మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దురద, వాపు ,పెదాల చుట్టూ పగలడం వంటి లక్షణాలు క‌నిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పచ్చిమామిడి పండ్లను ఓవ‌ర్‌ తిన్నప్పుడు కనబడుతుంది. మ‌రియు మామిడి పండ్లలో ఫ్రూట్ షుగర్ అధికంగా ఉంటుంది. ఇలాంటి షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని ఓవ‌ర్‌గా తినడం వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతుంది. కాబ‌ట్టి ఏదైనా లిమిట్‌గా తీసుకోవ‌డం చాలా ముఖ్యం.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: