మన శరీరంలో అతి పెద్ద అవయవం కాలేయం అని మనందరికి తెలిసిన విషయం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి అందించాలన్న కాలేయం సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు, అనేక రకాల వ్యాధుల వల్ల లివర్ చెడిపోవడానికి ముఖ్య కారణాలు అవుతున్నాయి. ఇంకా ఇందుకు ముఖ్య కారణం ఏమిటో  తెలుసుకుందామా మరి ...!

 

ముఖ్యంగా తీపి పదార్థం ఎక్కువగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెర ఎక్కువగా తినడం వల్ల ఆహారానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతేకాకుండా ఆ పదార్థం మొత్తం లివర్ లోనే పేరుకుపోయి కొవ్వుగా మారిపోతుంది. దీనితో కాలేయం పనితీరు పూర్తిగా చెడిపోతుంది. ఇంకా అలాగే, ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలు రుచికరంగా ఉండేందుకు మోనో సోడియం ఉపయోగిస్తూ ఉంటారు. దీనితో ఆహారాన్ని తిన్న అది మన శరీరంలో ఎక్కువ శాతం పేరుకుపోతుంది. దీనితో అది లివర్ చెడిపోవడానికి కారణం అవుతుంది. దానితో పాటు అతి ముఖ్యమైనవి కూల్ డ్రింక్స్. ఇక కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం పనితీరు మందగిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో లభించే పదార్థాలు కాలేయాన్ని పనిచేయకుండా చేస్తుంది. అందుకు చాలావరకు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది.

 

అయితే ఇక ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య సమస్యలలో ఎక్కువగా బాధపడేది లావుగా ఉండటం. వాస్తవానికి అధిక బరువు కలవారు కాలేయం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువ శాతం పేరుకొనిపోతే లీవర్ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అంతే కాకుండా షుగర్ వ్యాధితో బాధపడేవారు కి ఎక్కువ శాతం లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నవారు కూడా కాలేయం త్వరగా దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: