సాధార‌ణంగా నీరు శ‌రీరానికి ఎంత ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ‌రీరానికి స‌రిప‌డా నీరు తాగడం వల్ల దాదాపు 80 శాతం రోగాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులన్నీ నీటి వల్లనే జ‌రుగుతాయి. వాటిలో జీర్ణక్రియ, రక్త సరఫరా, మలినాలను తొలగించ‌డం, శరీర ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండేలా చూడటం, శోషణ వంటి ముఖ్యమైన జీవక్రియలు సక్రమంగా జరిగేలా నీరే చూసుకుంటుంది. అలాగే మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది కూడా నీరే. అందుకే పెద్ద‌వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు నీరు తాగ‌మ‌ని చెబుతుంటారు.

 

శరీరం అవసరాలకు సరిపడినంత నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. అలాగే సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది. ఒంట్లో నీరు తగ్గడం కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో మతిమరుపు వస్తుంది. అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం అని మ‌ర‌చిపోకండి. ప్రతి మనిషీ రోజుకు ఐదారు లీటర్ల నీరు త్రాగాలి. అయితే  నీరు బరువు తగ్గటానికి సాయపడతుందని మనలో చాలా మందికి తెలియదు. అవును! మీరు విన్న‌ది నిజ‌మే.  బరువు తగ్గించ‌డంతో నీరు ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

నీరు వివిధ కణాలకు అవసరమైన పోషకాలను తీసుకువెళుతుంది. శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపుతుంది. అందుకని భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. క్లినికల్ ట్రయల్ ప్రకారం ప్రతి భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగిన వారు 12 వారాలలో సగటున 2 కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే మీరు భోజనానికి ముందు నీరు తాగినప్పుడు, తక్కువ తింటారు. దీంతో బ‌రువు త‌గ్గే అవ‌క‌శాలు ఎక్కువ‌గా ఉంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: