అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు, రోగుల ప్రాణాల‌ను ర‌క్షించేందుకు  వైద్యులు, సిబ్బంది త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సేవ‌లందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది వైద్య‌సిబ్బంది క‌రోనా రోగుల‌కు వైద్యం అంద‌జేస్తున్న క్ర‌మంలో దాని బారిన ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. తాజాగా ఇండియాలోనూ క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతున్న వారిలో వైద్య‌సిబ్బంది కూడా ఉంటుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం.. దేశవ్యాప్తంగా 548 వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది.

 

అయితే వీరికి వైరస్‌ ఎలా సోకింద‌నే విష‌యంలో మాత్రం ఇంకా స్ప‌ష్ట‌తరాలేద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వాస్త‌వానికి వైద్యులు ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ రోగుల‌కు వైద్యం అద‌జేస్తున్నారు. అయినా వైర‌స్ వారిని క‌బ‌ళిస్తోంది. ఇండియాలో వైద్య సిబ్బందికి కూడా ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందియే అధికంగా క‌రోనా బారిన ప‌డ్డ‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఇలా క‌రోనా బారిన ప‌డిన‌వారిలో అత్య‌ధికంగా దిల్లీలో ఆస్ప‌త్రుల్లో ప‌నిచేసే సిబ్బంది ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో కేంద్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొంది.

 

దిల్లీలోనే మొత్తం 69 మంది వైద్యులకు 274 మంది నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది క‌రోనా సోకిన వారిలో ఉన్నారు. సఫ్దర్ జంగ్‌ ఆస్పత్రిలో ఏడుగురు రెసిడెంట్‌ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్‌ సహా 13మందికి కొవిడ్‌-19 సోకింది. అదే విధంగా ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో 10 మంది వైద్యసిబ్బందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వీరే కాకుండా దిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో బాధితులు ఉన్నారు. ఇదిలా ఉండ‌గ  దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 49,391 మందికి వైరస్‌ సోకగా 1,694 మంది మృతిచెందారు.
భార‌త్‌లో నియంత్ర‌ణ‌లో ఉన్న‌ట్లుగా ఉండి ఒక్క‌సారిగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. గ‌డిచిన నాలుగురోజుల్లోనే 10వేల కేసులు పెరిగిపోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: