దేశం మొత్తం క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతుండ‌గా...అద్భుత‌రీతిలో గోవా రాష్ట్రం బ‌య‌ట‌ప‌డ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. గ‌డిచిన 17 రోజుల్లో ఈ చిన్న రాష్ట్రంలో ఒక్క కేసు కూడా న‌మోదుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ క‌ట్ట‌డికి గోవా అనుస‌రిస్తున్న కట్టుదిట్టమైన చ‌ర్య‌లే ఇందుకు దోహ‌దం చేస్తున్నాయ‌ని చెప్పాలి. అయితే గోవా పక్కనే ఉన్న మహారాష్ట్రలో మాత్రం  అత్యధిక కేసులతో అల్లాడిపోతోంది... వాస్త‌వానికి ప‌ర్యాట‌క ప్రాంతంగా పేరుగాంచిన గోవాకే క‌రోనాతో ఎక్కువ డేంజ‌ర్ అన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైంది. ఇక్క‌డే కేసుల న‌మోదు ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. 

 

కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా త‌క్కువ‌గా కేసులు న‌మోదు కావ‌డంతో పాటు వ్యాప్తి జ‌ర‌గ‌కుండా అక్క‌డి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింద‌నే చెప్పాలి.  గోవా కరోనాకు పగ్గాలు వేసి మిగ‌తా ఆదర్శంగా నిలుస్తోంది. మార్చి 25 - ఏప్రిల్‌ 3 మధ్య ఇక్కడ ఏడుగురికి వైరస్‌ సోకింది. వారందరికీ సత్వర చికిత్సలు అందించి ఏప్రిల్‌ 19 నాటికి ఇళ్ల‌కు పంపించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గోవా తీసుకున్న చ‌ర్య‌ల‌ను మిగతా రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. కోవిడ్‌-19 కట్టడి వెనుక ఆ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, వైద్య సిబ్బంది సంయుక్త పోరాటం దాగుంద‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. 

 

అయితే అక్క‌డి ప్ర‌జ‌ల్లోని చైత‌న్యం, సామాజిక బాధ్య‌తగా సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం వంటివి ఉప‌క‌రించాయి. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్‌ రాణేలు మాట్లాడుతూ ఇదంతా ప్ర‌జ‌ల గొప్ప‌త‌నం..వారు క్ర‌మ‌శిక్ష‌ణ న‌డుచుకోవ‌డం వ‌ల్లే రాష్ట్రానికి క‌రోనా గండం త‌ప్పింద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగానే ఉంది. బుధ‌వారం మూడు కరోనా కేసులు మాత్రమే నమోదైన‌ట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు సంఖ్య 1085కి చరింది. అలాగే ఇప్పటివరకూ 29 మంది కరోనాతో మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: