ప్రపంచ దేశాలనూ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. ఒక్కో రోజు ఏకంగా వేలాది మంది మరణిస్తున్నారు. భారత్‌లో ఈ వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్ ప్రకటించినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం విస్తృతి ఆగ‌డం లేదు. నిత్యావసరాలకు లేదా ఎమెర్జీన్సీ అయితే తప్ప బయట కాలు పెట్టొద్దంటూ పలు సూచనలు చేస్తున్నా మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ బెంగాల్‌లాంటి రాష్ట్రాల్లో ఉల్లంఘ‌ణ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో అక్క‌డ వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉంటోంది. ఇదిలా ఉండ‌గా తాజాగా తెలిసిన ఒక విష‌యం వైద్యుల‌ను, ప్ర‌భుత్వాధికారుల‌ను షాక్‌కు గురి చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న విష‌యం తెలిసిందే.


అయితే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకూ వేగంగా  పెరుగుతోంది. పారామిలిటరీ బలగాల్లో మంగళవారం నాటికి 300గా ఉన్న కరోనా కేసులు బుధవారం నాటికి 388కు చేరుకున్నాయి. గురువారం ఫ‌లితాల్లో క‌ఛ్చితంగా 450పైనే ఉండే అవ‌కాశం ఉంద‌ని వైద్య వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది.  అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో బుధవారం కొత్తగా 85 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ విభాగంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 154కు చేరింది.ఇదిలా ఉండ‌గా దేశవ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ రోగులు సేవ‌లు చేస్తున్న  వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి కరోనా సోకుతోంది. ఇప్ప‌టికే వీరి సంఖ్య 600కు పైగా చేరుకుంది. 


మంగ‌ళ‌వారం నాడు విడుద‌ల చేసిన లెక్క‌ల ప్ర‌కారం ఒక్క ఢిల్లీలోనే 69 మంది వైద్యులు వైరస్‌ బారినపడ్డారు. భోపాల్‌లో కరోనా సోకి మరణించిన 17 మందిలో 15 మంది 1984 గ్యాస్‌ లీకేజీ ఘటన బాధితులేనని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నా వ్యాధి వ్యాప్తి మాత్రం త‌గ్గ‌డం లేదు. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య వృద్ధిరేటు 6.6 శాతంగా న‌మోద‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. కేసులు రెట్టింపు కావడానికి పట్టిన సమయం కూడా త‌గ్గ‌డం అంద‌రిలోనూ ఆందోళ‌న క‌లిగిస్తోంది. మే 2కి ముందు 15 రోజులతో పోల్చితే ప్రస్తుతం 11 రోజులకు పడిపోయిందని పాజిటివ్ కేసుల వృద్ధి రేటు 4.8 శాతంగా ఉందని ప్రముఖ ఆర్థికవేత్త షమికా రవి పేర్కొన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: