బొప్పాయి.. ప‌రిచ‌యం అవ‌సరంలేని పేరు. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంద‌ని నిపుణులు అంటున్నారు. ఒక మీడియం సైజ్ బొప్పాయిలో 300శాతం న్యూట్రీషియన్స్ ఉంటాయి. విటమిన్ సి కూడా ఎక్కువ. బరువు తగ్గించుకోవాలనేకునే వారికి కూడా బొప్పాయి చాలా సురక్షితమైనది. అయితే బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అయినా.. మ‌గ‌వారు దీన్ని ఎక్కువ‌గా తీసుకుంటే మాత్రం సీరియస్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

IHG

మ‌గ‌వారు ఎక్కువగా బొప్పాయిని తినడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. కాబట్టి మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే వాస్త‌వానికి జ్వరాలకు బొప్పాయి ఆకులను మందుగా వాడతుంటారు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కానీ, హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం బొప్పాయి పండుని తీసుకోకూడ‌ద‌ని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. బొప్పాయిలోని గుణాలు జ్వరం ఉన్న సమయంలో సమస్యని మరింత తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు.

IHG'PAPAYA' - Stress Buster

అదేవిధంగా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు బొప్పాయి తినడం మానయాలి. బొప్పాయిలో ఉండే పెపైన్ హార్ట్ బీట్ ను తగ్గిస్తుంది, కార్డియో వాస్కులర్ కండీషన్స్ ను మరింత తీవ్రం చేస్తుంది. ఎక్కువగా బొప్పాయి పండుని తినడం వల్ల బ్లడ్ షుగర లెవెల్స్ పడిపోతుంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉండడం మంచిదే. కానీ, మరీ తక్కువకి పడిపోవడం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కాబట్టి మీ స్థితిని బట్టి ఈ బొప్పాయిని తీసుకోవ‌డం ఉత్త‌మం. మ‌రియు శ్వాస సమస్యలు, ఆస్త్మా, అలర్జీ సమస్యలున్నప్పుడు , బొప్పాయిని తీసుకోకపోవడమే మంచిది.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: