అగ్ర‌రాజ్యం అమెరికా త‌మ దేశానికి మిగ‌త దేశాల వారు ఉపాధి, ఉద్యోగ‌ రీత్య రాకుండా వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ త‌ర్వాత ఉద్యోగావ‌కాశాల్లో  అమెరికావాసుల‌కే ప్ర‌థ‌మ ప్రాధాన్యం ద‌క్కేలా చేయ‌డానికే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించాడు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా వెళ్లాల‌ని క‌ల‌లుగ‌న్న యువ‌త‌కు నిరాశ త‌ప్ప లేదు. అయితే ఇలాంటి ప‌రిణామంలో వైద్య విద్యన‌భ్య‌సించిన వారికి మాత్రం అమెరికా విదేశాంగ శాఖ తీపి క‌బురు చెప్పింద‌నే చెప్పాలి. ప్రస్తుతం ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఆ దేశంలో తారస్థాయికి చేరింది. 

 

క‌రోనా గండం నుంచి దేశం గ‌ట్టెక్కాలంటే ముందు వైద్యం అందుతున్న తీరులో మార్పులు తీసుకురావాల‌ని  అక్కడి చట్టసభ ప్రతినిధులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో వైద్య‌విద్య‌న‌భ్య‌సించిన వారు బ‌హుత‌క్కువ‌నే చెప్పాలి. వైద్యుల సంఖ్య‌ను భారీగా పెంచుకోవాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు  వైద్యుల త‌యారీ అనేది అసాధ్యం కావున ఇత‌ర దేశాల్లో ఉన్న వైద్యుల‌ను ఆక‌ర్షించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తోంది. అందుకే  ఎవరికీ కేటాయించని విధంగా  దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు ఇచ్చేందుకు చట్టాన్ని తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

 

ఇదిలా ఉండ‌గా  ఇప్పటివరకూ అమెరికాలో 12లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 77 వేలు దాటింది. రోజూ వేలాది మందికి కొత్త‌గా వైర‌స్ ప్ర‌బ‌లుతోంది. కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే స‌మ‌యంలో రిక‌వ‌రీ కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం అమెరిక‌న్ల‌ను బాగా క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మెరుగైన వైద్య విధానానికి అమెరికా శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ ప్రకారం  గ్రీన్‌కార్డులకు అనుమతించేందుకు అమెరిక‌న్ కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొంద‌నున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: