సమ్మర్ లో విరివి గా దొరికే వి అంటే అవి మామిడి పండ్లు, తాటి ముంజలు.. వీటిని ఎంత ఖర్చయి నా తినా లని చాలా మంది అనుకుంటారు.. కొంత మంది తినడం మానేస్తారు.. వీటిని సంవత్సరాని కి ఒక్కసారై నా ఎందుకు తినా లో తెలిస్తే ఇంక ఎక్కడున్నా వెతికి మరి తింటారేమో..  అందుకే సహజ సిద్దం గా దొరికే వాటి లో ఎన్ని ఔషద గుణాలు ఉన్నాయి అనే విషయా లను తెలుసు కోవాలి.. 

 

 

 

 

తాటి ముంజలు అనే పల్లె ల్లో ఉన్న వాళ్లకు మాత్రం బాగా తెలుస్తుంది.. ఎందుకంటే తాటి చెట్లు పల్లెల్లో ఎక్కువ గా కనిపిస్తాయి.. ముంజులు శరీరానికి డీహైడ్రేషన్ సమస్య లేకుండా చూస్తాయి. దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలిన వాళ్లకు ముంజుల ను జ్యూస్‌ గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్య లకు మంచి ఔషదం గా పనిచేస్తుంది. దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు ఏర్పడినట్ల తే తాటి ముంజుల గుజ్జుని శరీరాని కి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గి పోతాయి.

 

 

 

కొవ్వు ను కంట్రోల్ చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకుల ను బలంగా ఉంచేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజులు చాలా మంచి వట. కొబ్బరికాయల్లో ఉన్నట్లే తాటి ముంజుల మధ్యలో స్వచ్ఛ మైన, రుచి కరమైన నీరు ఉంటుంది. ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కణాల నిరోధాని కీ ముంజులు ఉపయోగ పడతాయి, రొమ్ము క్యాన్సర్‌ కు కారణమయ్యే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్‌లను నిర్మూలిస్తాయి. అజీర్తి, ఎసిడిటీ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇప్పుడు అర్థమైందిగా.. సర్వ రోగాలను నివారించే ముంజలను ఈ వేసవిలో అసలు మర్చిపోకుండా తినండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: