దాదాపు 47 రోజులకు పైగా లాక్ డౌన్ అనంతరం రైల్వే శాఖ మంగ‌ళ‌వారం నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాల‌ను ఇప్ప‌టికే విడుదల చేయ‌డం కూడా పూర్తైంది. అయితే రైల్వే సేవ‌ల ప్రారంభంపై మాత్రం జ‌నాల నుంచి, మేధావి, వైద్య వ‌ర్గాల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు వ్య‌వ‌హారంతో క‌రోనా వ్యాప్తి అధిక‌మ‌వుతోంద‌న్న నివేదిక‌లు ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి అందాయి. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల త‌గ్గుముఖం ప‌ట్టిన తెలంగాణ‌, కేర‌ళ రాష్ట్రాల్లో మ‌ళ్లీ కేసుల సంఖ్య‌పెర‌గ‌డానికి కార‌ణం వ‌ల‌స కార్మికులేన‌ని తెలుస్తోంది. 

 

ముఖ్యంగా తెలంగాణ‌లో కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో వ‌ల‌స కార్మికుల‌కు సంబంధించినవే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు కేంద్రం ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించ‌డం వ్యాధి వ్యాప్తికి దోహ‌దం చేస్తుంద‌న్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇన్నాళ్లు ఒపిక ప‌ట్టిన కేంద్రం మ‌రికొద్దిరోజులు ఆగాల్సి ఉంది అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలో 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనున్న‌ట్లు రైల్వే అధికారులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు నడవనున్నాయి.

 


ఇక రైల్వే టికెట్ల బుకింగ్‌కు సోమ‌వారం సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చ‌ని స్ప‌ష్టం చేసింది.  ఇక  తెలంగాణకు ఢిల్లీ నుంచి ఓ రైలు రానుండగా.. ఏపీకి మాత్రం ప్రస్తుతానికి రైలు సర్వీసులు న‌డ‌పబోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే వలస కూలీల తరలింపు కోసం రైల్వే శాఖ రోజుకు 300 శ్రామిక్ రైళ్లు నడుపుతుండ‌గా వాటికి అద‌నంగా ఈ రైళ్ల‌తో సాధార‌ణ ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌నున్నారు. అయితే టికెట్ బుక్ చేసుకున్న‌ ప్రయాణికులు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. గంట ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహించిన త‌ర్వాతే రైలు ప్ర‌యాణానికి అనుమ‌తి లభిస్తుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: