పీరియ‌డ్స్‌.. ప్ర‌తి మ‌హిళ జీవితంలోనూ ఇది కామ‌నే. సాధార‌ణంగా అమ్మాయిలు యుక్తవయసులోకి అడుగుపెట్టిన ప్రారంభదశలోనే ఈ రుతుస్రావం అనేది స్టార్ట్ అవుతుంది. అది దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. అయితే ప్రతినెల పీరియ‌డ్స్‌ సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు.  ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు. ఈ క్ర‌మంలోనే ఆ నొప్పిని త‌గ్గించుకోవ‌డానికి ఏవేవో ట్యాబ్లెట్స్‌‌ వాడుతుంటారు. కానీ, దీనివల్ల భవిష్యత్‌లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

 

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా పీరియ‌డ్స్‌లో వ‌చ్చే నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. అందులో ముందుగా..  తులసి ఆకులని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కుని ఓ రెండు కప్పుల నీటిలో ఈ ఆకులని వేసి మరిగించుకోవాలి. ఈ రసాన్ని రోజంతా కొద్దిగా తాగుతుండండి.. దీని వల్ల పీరియడ్స్ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు ఇతర సమస్యలు తగ్గుతాయి. అలాగే ఒక స్పూన్‌ ధనియాలను గ్లాసునీళ్ళలో వేసి మ‌రిగించాలి. నీళ్ళు సగానికి వచ్చే వరకూ మరిగించి, తర్వాత క్రిందికి దింపుకొని, గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.

 

ఇలా చేయడం వ‌ల్ల పీరియ‌డ్స్‌లో వ‌చ్చే నొప్పిని త‌గ్గించ‌డంతో పాటు అదనపు రక్తస్రావంను నివారిస్తుంది. అదేవిధంగా, పీరియడ్స్ టైమ్‌లో వేడినీటిని ఉపయోగించడం మంచిది. శరీరంలోకి తీసుకోవడమైనా.. స్నానానికి వేడినీటిని వాడడం ఉత్త‌మం దీని వల్ల బాడీపెయిన్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి కూడా దూరమవుతుంది. ఇక పీరియడ్స్ కు ముందు బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది రక్త ప్రసరణ రెగ్యులేట్ చేస్తుంది. మ‌రియు పీరియడ్స్‌లో వచ్చే క‌డుపు నొప్పిని  తగ్గిస్తుంది. మ‌రియు పీరియ‌డ్స్ టైమ్‌లో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. పీనట్ బటర్, శనగలు, అరటిపండ్లు ఇలాంటివి డైట్‌లో చేర్చుకోవాలి.

   
 

మరింత సమాచారం తెలుసుకోండి: