నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాక్ ఔష‌ధ‌ కంపెనీలు కొన్ని విట‌మిన్ మాత్ర‌ల‌ను అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ఇమ్రాన్‌ఖాన్ విచార‌ణ‌కు ఆదేశించారు. భార‌త్ నుంచి దాదాపు  450 ప్రాణాధార ఔషధాలు అక్రమంగా దిగుమతి అయ్యాయన్న పాకిస్థాన్ మీడియాలో గ‌త కొద్దికాలంగా క‌థ‌నాలు ప్ర‌చురితం అవుతున్నాయి. భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసిన త‌ర్వాత కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు పాకిస్తాన్‌లో  కొరత ఏర్పడింది. పాకిస్తాన్‌లోని చాలా ఫార్మా కంపెనీల‌కు ముడిస‌రుకుకు కూడా  ఇబ్బందులు ఏర్ప‌డ‌టంతో భార‌త్ నుంచి దిగ‌మతి చేసుకునేందుకు అనుమ‌తులిచ్చింది. 


అయితే పాకిస్తాన్‌లోని కొన్ని కంపెనీలు ఈ అనుమ‌తుల‌ను సాకుగా చూపుతూ భార‌త్ నుంచి విట‌మిన్ మాత్రల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ట్లు అక్క‌డి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డడ‌టంతో ఇమ్రాన్ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ విషయమై విపక్షాల నుంచి విమర్శలు  పెద్ద ఎత్తున రావ‌డంతో ఇమ్రాన్ ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  ఇదిలా ఉండ‌గా రెండు రోజుల క్రితం పాకిస్తాన్ లాక్‌డౌన్ నిబంధ‌న‌లను స‌డ‌లించిన విష‌యం తెలిసిందే. విదేశాల నుంచి తిరిగివచ్చే  ప్ర‌జ‌ల‌కు క్వారంటైన్‌ సమయాన్ని48 గంటలకు త‌గ్గించేయ‌డం గ‌మ‌నార్హం. పరీక్షల్లో వారికి కరోనా లేదని తేలితే, ఆ సమయం తర్వాత వారిని ఇళ్లకు  పంపుతున్నారు. 


అయితే పాక్‌లో క‌రోనా ఉధృతంగా సాగుతున్న నేప‌థ్యంలో అవ‌స‌రానికి మించిన రీతిలో స‌డ‌లింపులు ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తీరోజు వేల సంఖ్య‌లో క‌రోనా కొత్త కేసులు న‌మోద‌వుతుండగా మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికితో క‌రోనా రోగుల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేదని, క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య కూడా చాలా త‌క్కువ‌గా ఉంటోంద‌ని విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌లో మంగ‌ళ‌వారం పాక్‌లో కొత్తగా 1,733 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,674కు చేరింది. ఇప్పటివరకూ ఇక్కడ 724 మంది కరోనా కారణంగా మృతిచెందారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: